
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో Ai+ Nova 2 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో 50MP ప్రధాన కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 6000mAh బ్యాటరీ ఉంది. Ai+ నోవా 2 అల్ట్రా 5G పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Ai+ Nova 2 Ultra 5G offers
Ai+ Nova 2 Ultra 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.31,999 ఉండగా ఇప్పుడు సేల్‌లో 34 శాతం తగ్గింపుతో కేవలం రూ.20,499 లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ.2,950 తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
Ai+ Nova 2 Ultra 5G Features
Ai+ Nova 2 Ultra 5G ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కూడిన 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, మరియు ఒక USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు.









