Arvind Kejriwal Death Threat

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ కొందరు దుండగులు పన్నిన కుట్ర నెట్టింట కలకలం సృష్టిస్తోంది. అడిగినంత డబ్బులు ఇస్తే ఓకే.. లేదంటే ఆయనతో పాటు ఆయన కూతురుని కూడా లేపేస్తామంటూ అవతలి వ్యక్తి బెదిరించడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపు కాల్స్ ఆప్ ఎమ్మెల్యేకు రావడంతో ఆయన ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం..

Also Read : సంచలన దొంగతనం: కొత్త తనిష్క్ షోరూమ్‌లో రూ. 50 కోట్ల బంగారం మాయం!

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జర్త్నెల్ సింగ్‌కు నవంబర్ 6న ఒక ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్, వాట్సాప్ మెసేజ్‌ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వాడిగా పరిచయం చేసుకున్నాడు. తాను చెప్పబోయే విషయాల్ని అరవింద్ కేజ్రీవాల్‌కు తెలియజేయాలని తెలిపాడు. తనకు వెంటనే రూ.7 కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కూతురు హర్షిత కేజ్రీవాల్‌ను కూడా చంపేస్తామని బెదిరించాడు.

అదే సమయంలో ఎమ్మెల్యే వాట్సాప్‌లో కూడా వార్నింగ్ మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని.. వెంటనే మోహాలీ ఎస్‌ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మోహాలీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద FIR నమోదు అయింది.

దర్యాప్తులో భాగంగా అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. బెదిరింపులకు ఉపయోగించిన వ్యక్తి ఫోన్ నంబర్ వివరాలు, కాల్ రికార్డులు, లొకేషన్‌, ఐపీ లాగ్‌లు, వాట్సాప్ చాటింగ్ డేటా ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Also Read : లేఆఫ్స్ కలకలం.. భారత్‌లో 1000 మంది తొలగింపు