
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని యూజర్లను కలిగి ఉన్న ప్రముఖ సోషల్ మీడియా మెసెంజర్ యాప్ వాట్సాప్ తరచూ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వినియోగదారుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని రకరకాల భద్రతా ఫీచర్లను అందిస్తూ.. వాటిని మరింత పటిష్టం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరొక అద్భుతమైన ఫీచర్‌పై వాట్సాప్ వర్క్ చేస్తోంది. అదే.. ‘వివ్ వన్స్ ఆప్సన్’. ఇంతక ముందు ఈ ఫీచర్.. కేవలం ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజీలకు మాత్రమే యాక్సెస్ ఉండేది.
Also Read : రైల్వే శాఖ గుడ్ న్యూస్.. త్వరలో RAC రద్దు!
కానీ వాట్సాప్ ఇప్పుడు.. టెక్స్ట్ మెసేజీలకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అంటే.. ఇతరుల నుండి వచ్చిన మెసేజ్‌ను ఓపెన్ చేసి ఒకసారి చదివి క్లోజ్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ కనిపించకుండాపోతుంది. మళ్లీ వాటిని చదవాలన్నా సాధ్యపడదు. అంతేకాదు.. ఆ మెసేజీలను స్క్రీన్ షాట్ తీయకుండా, టెక్స్ట్‌ను కాపీ, షేర్ చేయకుండా ఉండేందుకు వాట్సాప్ ఈ ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ‘వివ్ వన్స్ టెక్స్ట్ మెసేజ్’ ఫీచర్ అందరి యూజర్లకు అందుబాటులో లేదు. కేవలం సెలెక్ట్ చేసిన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే యాక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరణతో కూడిన వీడియోను వాట్సాప్ త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తే.. ఎంతమందికి ప్రయోజనకరంగా ఉంటుందో చూడాలి.
Also Read : TVS నుంచి ఊరమాస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఫుల్ మైలేజీ..!









