
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. పది కాదు ఇరవై కాదు.. ఏకంగా ముప్పైవేలకు పైగా భారీ తగ్గింపు ప్రకటించింది. ఎప్పటి నుంచో ఒక మంచి ఫోన్‌ను కొనుక్కోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. మీరు కేవలం రూ.30వేలలోపు ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం. ఇప్పుడు ఆ ఫోన్ వివరాలు, ధర, ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
Google Pixel 7 offers
అమెజాన్ (Amazon) తాజాగా బ్రాండెడ్ Google Pixel 7 స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ ప్రకటించింది. Google Pixel 7లోని 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.59,999లకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ Amazonలో రూ.29,499లకే లభిస్తోంది. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HSBC క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్లపై 5శాతం (రూ.1,474) వరకు తగ్గింపు లభిస్తుంది.
అలాగే ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో దీనిని రూ.27,650లకే కొనుక్కోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్ పనితీరు, బ్రాండ్ బట్టి ధర మారుతూ ఉంటుంది. మొత్తంగా ఈ Google Pixel 7 లాంచ్ ధరకంటే రూ.31,975 తక్కువకే లభిస్తుంది.
Google Pixel 7 specs
Google Pixel 7 మొబైల్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.30-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే ఆక్టాకోర్ టెన్సర్ జీ2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందించారు.
కెమెరా విషయానికొస్తే.. Google Pixel 7 వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.









