Ambati Rambabu :  వైసీపీ ముగ్గురు ముఖ్య నేతలకు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నాయకుల అమరావతి పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ పర్యటనలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానిలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు రైతులపై దాడికి తెగబడ్డారు.

ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ విధుల్లో ఉన్న తాడేపల్లి సీఐని అంబటి రాంబాబు బలంగా తోసేశారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని నెట్టడమే కాకుండా, తన విధులకు ఆటంకం కలిగించి, తనను వ్యక్తిగతంగా దూషించారంటూ తాడేపల్లి సీఐ స్వయంగా వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో అంబటి రాంబాబుపై విధుల్లో ఉన్న పోలీసును నెట్టినందుకు ప్రభుత్వ అధికారిని అడ్డుకున్నందుకు ఒక కేసు నమోదైంది.

మరోవైపు, ఈ ఘర్షణల సమయంలో వైసీపీ నేతలు కులం పేరుతో దూషించారంటూ ఒక ఎస్సీ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబు ఇతర నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఈ కేసుల్లో పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్ 30, 30A తో పాటు, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 223, 132 r/w 3(5) కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి పర్యటన ఉద్రిక్తత కాస్తా ఇప్పుడు ఈ ముగ్గురు ముఖ్య నేతలపై వరుస కేసుల నమోదుకు దారితీసింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.