
గత మూడు రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన మార్పుల వల్ల దేశీయంగా పసిడి ధరలు భారీగా పుంజుకున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,770 మేర పెరిగి రూ.1,44,550కు చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,450 పెరిగి రూ.1,32,500 కి చేరింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,820 పెరిగి రూ.1,08,410 గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,180 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,34,000గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.1,11,600 గా ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్కతా, బెంగళూరు, కేరళ రాష్ట్రంలో బంగారం ధరలు ఒకే రకంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాలలో 24 క్యారెట్ల ధర రూ.1,44,550 దగ్గర పలుకుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,500,18 క్యారెట్ల ధర రూ.1,08,410 గా నమోదైంది.
ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో పసిడి రేట్లు మిగతా నగరాల కంటే స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,700 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,650 ఉండగా..18 క్యారెట్ల ధర రూ.1,08,560 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గుజరాత్లోని ప్రముఖ నగరం అహ్మదాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,600 పలుకుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,550 గా,18 క్యారెట్ల ధర రూ.1,08,460 గా ఉంది.









