అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దోహాలో జరిగిన సాంకేతిక చర్చలు సానుకూలంగా ముగిశాయని మధ్యవర్తిత్వంగా ఉన్న ఖతార్, పాకిస్తాన్ వెల్లడించాయి. జూన్ 17న జరిగిన 14-అంశాల అవగాహన ఒప్పందంలో మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించడంపైనే ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఒప్పంద ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి వాషింగ్టన్‌తో చర్చలు కొనసాగించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ఫిబ్రవరి 28న వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 4 నుండి 9 వరకు ఇరాన్‌, ఇరాక్‌లో జరగనున్నాయి. ఈ కారణంగా దౌత్యపరమైన చర్చలు కొద్దిరోజుల పాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

Also Read : కూలిపోనున్న పాక్ ప్రభుత్వం.. ఎదురుతిరిగిన వేల మంది ప్రజలు

మరోవైపు బహ్రెయిన్‌లో అమెరికా నేతృత్వంలో జరిగిన ప్రాంతీయ భద్రతా సదస్సును ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య స్వేచ్ఛను కాపాడటంపై సౌదీ అరేబియా, యూఏఈ, సిరియాతో సహా 12 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో చర్చించారు. దీనిపై ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పందిస్తూ.. హోర్ముజ్ జలసంధి అమెరికా సెంట్‌కామ్ పరిధిలోకి రాదని, అది పూర్తిగా ఇరాన్ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా బలగాలు ఈ ప్రాంతం నుంచి తప్పుకుంటేనే నిజమైన భద్రత సాధ్యమవుతుందన్నారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిలో ఒక విదేశీ కంటైనర్ నౌక ఒడ్డుకు కొట్టుకుపోగా, యుద్ధ విరమణ ఒప్పందాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఐదుగురు పాలస్తీనియన్లను హతమార్చాయి. అలాగే దక్షిణ లెబనాన్‌లో దాడులు కొనసాగిస్తున్నాయి. పశ్చిమ జెరూసలంలో శాశ్వత అమెరికా రాయబార కార్యాలయం ఏర్పాటు కోసం ఇజ్రాయెల్, అమెరికాలు ఒక డాలర్ లీజు ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Also Read : “అమెరికా ఆర్థిక సాయం మాకొద్దు..” ట్రంప్‌కు నెతన్యాహు బిగ్‌షాక్..