Thursday, May 21, 11:48
34.2 C
Hyderabad

Hyderabad Murder Case: హైదరాబాద్ లో దారుణం.. రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య

Hyderabad Murder Case
Hyderabad Murder Case

హైదరాబాద్ లో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్‌లోని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే నివాసంలో ఆయన భార్య దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిమనిషే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆ నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆమె ఇంట్లోనే విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్,  డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న పని మనిషిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలాన్ని సీటీ సీపీ సజ్జనార్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు.

Also Read: ప్లీజ్.. ప్లీజ్ ఒక్కసారి.. నడిరోడ్డుపై MLAపై చేయి వేసి..!