collagen gel benifits
collagen gel benifits

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మోకాళ్లు, నడుము నొప్పులు వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. వీటితో పాటు వృద్ధాప్య ఛాయలు కూడా.. వయసుతో పాటు ముడతలు, సన్నని గీతలు, చర్మం కుంగిపోవడం వంటివి సాధారణమే. అయితే ప్రస్తుత రోజుల్లో సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం, ఎండకు ఎక్కువగా గురికావడం, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా ఈ సమస్యలు చిన్న వయసులో కూడా కనిపిస్తున్నాయి.

అందువల్ల చాలా మంది తమ చర్మాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో రకాల స్కిన్ ప్రొడెక్ట్స్ వాడుతున్నారు. అయినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అలాంటి వారికి ఓ చక్కటి టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా.. మీ ఇంటి దగ్గర ఉన్న ఒక వస్తువుతో మీ చర్మాన్ని మృదువుగా, మిలమిల మెరిసేలా చేసుకోవచ్చు. అంతేకాకుండా చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు ఏర్పడకుండా నివారిస్తుంది. అదే ‘కలబంద’.

దశాబ్దాలుగా కలబందను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే అనేక నేచురల్ పదార్థాలు చర్మ సంరక్షణకు సహాయపడతాయి. అందులో..

కలబంద చర్మాన్ని తేమగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

చర్మం చాలా మృదువుగా.. తాజాగా అనిపించేలా చేస్తుంది.

దీనిని ముఖానికి పూయడం వల్ల పొడిబారడాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

ఇది స్కిన్‌ను ముడతల నుంచి కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

చర్మంపై ఎరుపుదనాన్ని మరియు తేలికపాటి చికాకును తగ్గించడంలో కలబంద చాలా మంచిది.

కలబంద కొల్లాజెన్ జెల్ ఎలా తయారు చేయాలి?

ముందుగా కలబందను శుభ్రంగా కడిగాలి. తర్వాత వాటి తొక్క తీసి లోపల ఉన్న జెల్‌ను బయటకు తీయండి.

తర్వాత కొబ్బరి నూనె, విటమిన్ ఇ, రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఆపై జెలటిన్‌ను గోరువెచ్చని నీటిలో కరిగించి దానిని మిక్స్ చేసిన కలబందలో వేసి బాగా కలపాలి.

ఇలా చేయడం ద్వారా కలబంద కొల్లాజెన్ జెల్ రెడీ అవుతుంది. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.

ముఖానికి అప్లై చేసే పద్ధతి:

కొల్లాజెన్ జెల్‌ను అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

తర్వాత ఆ ముఖాన్ని తడిలేకుండా తుడుచుకోవాలి.

ఆపై జెల్‌ను ముఖానికి, మెడకు అప్లై చేస్తూ.. గుండ్రంగా సున్నితంగా మసాజ్ చేయాలి.

అనంతరం 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

అలాగే దీనిని ఫేస్ మాస్క్‌లా రాత్రంతా కూడా ఉంచుకోవచ్చు. దీనిని వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించడం వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు త్వరగా తొలగిపోతాయి.

గమనిక: ఇందులో ఎలాంటి కెమికల్ పదార్థాలు లేనప్పటికీ ఒక్కోక్కరి స్కిన్ ఒక్కో విధంగా ఉంటుంది. అందువల్ల ఈ జెల్‌ను అప్లై చేసే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఆ సమయంలో దురద, మంట లేదా అలెర్జీ వంటివి ఎదురైతే వెంటనే ఆపేయాలి.