Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Bandi Bhagirath POCSO Case: అండర్‌గ్రౌండ్‌లోకి తెలంగాణ బీజేపీ నేతలు.. అసలేం జరుగుతోంది?

Bandi Bhagirath POCSO case
Bandi Bhagirath POCSO case

Bandi Bhagirath POCSO case:  తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో తీవ్ర అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ కేసు నేపథ్యంలో తెలంగాణ బీజేపీలోని కీలక నేతలంతా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారనే చర్చ జరుగుతోంది. ఈ సున్నితమైన అంశంపై ఎక్కడ స్పందించాల్సి వస్తుందో అన్న భయంతోనే నాయకులు అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసినా నేతలు స్పందించడం లేదని, క్యాడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం లేక గందరగోళం నెలకొందని తెలుస్తోంది. పలువురు సీనియర్ నాయకులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని మీడియాకు దూరంగా ఉంటున్నారు. చివరకు పార్టీ కార్యాలయంలో కూడా ముఖ్య నేతలు కనిపించడం లేదని, అత్యవసర సమావేశాలకు సైతం వారు హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు ప్రభావం రాబోయే రాజకీయాలపై తీవ్రంగా పడుతుందని నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: భారత్ రహస్య ఆపరేషన్… చైనా, పాక్‌లకు నిద్రలేకుండా చేసిన సరికొత్త అస్త్రం!

మరోవైపు, గత వారం రోజులుగా బండి భగీరథ్ పోలీసులకు చిక్కకుండా పరారీలోనే ఉన్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు పోలీస్ టీమ్స్ ఢిల్లీకి వెళ్లగా, మరో రెండు బృందాలు హైదరాబాద్‌లో, ఒక టీమ్ కరీంనగర్‌లో వెతుకుతున్నాయి. పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ భగీరథ్ విచారణకు హాజరు కాలేదు. అయితే, తనకు రెండు రోజుల సమయం కావాలని కోరుతూ ఆయన పోలీసులకు ఈమెయిల్ పంపారు. ఈ మెయిల్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు భగీరథ్‌ను ఎవరు దాచిపెడుతున్నారు, పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారనే అంశంపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో,రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.