
CM Revanth Reddy : టీచర్లతో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను 2034 వరకు సీఎంగా ఉంటానని అన్నారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకుని తాను సీఎం అయ్యానని చెప్పుకొచ్చారు. ఈ మూడేళ్లలో తెలంగాణను ఎంతో సక్రమంగా నడిపించానని చెప్పుకొచ్చారు. తాను సీఎం అయ్యాకే 1వ తేదీ నుంచి జీతాలు వస్తున్నాయన్నారు.
ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల సమస్య కోసం కొట్లాడలన్నారు. విద్యాశాఖలో రిఫామ్స్ పై మాట్లాడినప్పుడు ఉపాధ్యాయ సంఘాలు తన మీద కోపంగా మాట్లాడుతున్నాయన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమస్యలు తనకు వదిలేయాలని, అవన్ని తాను చూసుకుంటానన్నారు. బదిలీలు,. ప్రమోషన్లు అన్ని తాను అడగకుండానే ఇచ్చానని సీఎం తెలిపారు.
Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. రేపే లాస్డ్ డేట్.. ఇలా చేయకపోతే మీ కార్డ్ ఔట్!
ఇక లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్రమశిక్షణ లేకపోతే ఎంత తెలవి ఉన్నా పనికిరాదన్నారు. అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతాడని, చైనా, జర్మనీలో ఇంగ్లీష్ వచ్చినవాళ్లు 10 శాతం కూడా ఉండరని, కానీ వాళ్లు ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నారు? అమెరికాపై తగ్గించి జర్మనీ, జపాన్లపై ఫోకస్ పెట్టండని తెలిపారు. టీచర్లు ఐదేళ్లు పిల్లల కోసం ఆలోచించాలన్నారు. మండలాన్ని యూనిట్ గా తీసుకుని ఏం మార్పులు కావాలో చెప్పాలన్నారు. పై నుంచే వచ్చే ఆదేశాలు కాదు కింది నుంచి మీరు సలహాలు ఇస్తే పాటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
విద్యలో నాణ్యత పెరగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంతో మనపిల్లలు పోటీ పడాలన్నారు. ప్రభుత్వాలు సాధారణంగా ఓటుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాయని, కానీ తాము అధికారంలోకి వచ్చాక కూడా రాజకీయాలు చేయొద్దని ఆలోచించామని వెల్లడించారు. వెనుకబాటు తనానికి ఆస్తికి సంబంధం లేదని తెలిపారు సీఎం. ఆస్తి ఉన్నా, చదువులేక ఇబ్బందిపడుతున్న వాళ్లూ ఉన్నారు.. యాదవ, కురుమ సోదరులకు ఆస్తి ఉంటుంది.. కానీ పిల్లలను చదివించుకోలేక కొంత ఇబ్బందిపడ్డారు.. ఆదాయం పెంచాలి, ప్రజలకు పంచాలనేదే మా ఆలోచన అని చెప్పుకొచ్చారు. బడ్జెట్లో విద్యకు 9 శాతం ఖర్చు చేస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 8 వేలు ఖర్చు చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.
తెలంగాణకు పూర్తిస్థాయి విద్యాశాఖమంత్రి లేరని కొందరు అంటున్నారు.. అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు.. మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తాను ఇంత కమిట్మెంట్తో పని చేసినందుకు విద్యశాఖ నుంచి తప్పుకోవాలా అని నిలదీశారు. టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా?.. ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు తప్పుకోవాలా అని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు,
Also Read : బిగ్ షాక్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్









