Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

KC Venugopal Political Career: పాపం కేసీ వేణుగోపాల్.. ఎందరినో సీఎం, మంత్రులుగా చేసి.. ఆయన విషయంలో అసలేం జరిగింది?

KC Venugopal Political Career
KC Venugopal Political Career

KC Venugopal Political Career: కాంగ్రెస్ అధినాయకత్వానికి అత్యంత నమ్మకస్తుడు, జాతీయ రాజకీయాలను శాసించే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,  రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఆయనది కీలక పాత్ర. కాంగ్రెస్ హైకమాండ్ అంటే రాహుల్,ఖర్గే తరువాత వినిపించేది ఆయన పేరే.  ఢిల్లీలో కూర్చుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించిన ఆయన తన సొంత రాష్టానికి మాత్రం సీఎం కాలేకపోయాడు. ఆయనే కేసీ వేణుగోపాల్.  జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఉంటూ.. సొంత రాష్ట్రానికి వచ్చేసరికి సీఎం పీఠానికి దూరయ్యారు. 

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

కర్ణాటక ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం పెద్ద యుద్ధమే జరిగింది. అప్పుడు ఢిల్లీలో హైకమాండ్ తరఫున పంచాయితీ చేసి, ఇద్దరినీ ఒప్పించి సిద్ధరామయ్య పేరును సీఎంగా ప్రకటించింది ఈయనే. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు సీనియర్ల నుండి తీవ్ర పోటీ ఎదురైనా.. రేవంత్ రెడ్డి పేరును సీఎం అభ్యర్థిగా దిల్లీ నుండి అధికారికంగా ప్రకటించింది కేసీ వేణుగోపాలే. ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమందిని సీఎం కుర్చీలో కూర్చొబెట్టిన కేసీ వేణుగోపాల్..  కేరళలో కాంగ్రెస్ గెలిచేసరికి మాత్రం ఆ కుర్చీపై కూర్చోలేకపోయారు.

Also Read: హైకమాండ్ నిర్ణయంపై కేసీ వేణుగోపాల్ సంచలన కామెంట్స్

మే 4న కేరళ ఫలితాలు వచ్చి కాంగ్రెస్ కూటమికి 102 సీట్లు రాగానే, కేసీ వేణుగోపాల్ సీఎం కావడం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ వారం రోజులకు పైగా సాగిన హైడ్రామా తర్వాత సీన్ మారింది. గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉంటూ అసెంబ్లీలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై పోరాడిన వీడీ సతీశన్‌కే కేరళలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలు జై కొట్టాయి. దీంతో హైకమాండ్ వీడీ సతీశన్‌నే సీఎంగా ప్రకటించింది.

Also Read: దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!

లోక్ సభ ఎంపీగా

కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం లోక్ సభ ఎంపీగా ఉన్నారు. అంతేకాకుండా ఏఐసీసీలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్నారు. రాహుల్ గాంధీని కలవలంటే ముందుగా ఈయన పర్మిషన్ ఉండాలనేది కాంగ్రెస్ లో టాక్. ఎన్నో పంచాయతీలకు చక్కబెట్టే వేణుగోపాల్ ఒక రాష్టానికి పరిమితం అయితే జాతీయ స్థాయిలో పార్టీ సమన్వయం దెబ్బతింటుందని హైకమాండ్ భావించింది.  

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

ఇక కేసీ వేణుగోపాల్ 1996, 2001, 2006లో వరుసగా మూడుసార్లు అలప్పుజ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 2009, 2014,  2024లో అలప్పుజా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 2020లో రాజ్యసభగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమెన్ చాందీ ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా,    మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.