Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Revanth Reddy NEET UG: వారికి అండగా ఉంటా..BJP,  BRSపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy NEET UG
Revanth Reddy NEET UG

Revanth Reddy NEET UG: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పరీక్ష రద్దు నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనను నింపింది. పేపర్ లీకేజీ, రద్దుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పేపర్ లీకేజీల వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

గతంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. వైఫల్యాలు, నమ్మకద్రోహం, అవినీతి విషయంలో ఈ రెండు పార్టీల తీరు ఒకేలా ఉందంటూ ఆరోపించారు. గతంలో రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీల తరహాలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.  పోటీ పరీక్షలు అనేవి ప్రతిభకు, అవకాశాలకు వేదిక కావాలి కానీ, ఇలాంటి గందరగోళానికి కాదని  సీఎం తన ట్వీట్ లో తెలిపారు. 

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

పూర్తిగా అండగా ఉంటాం 

ఈ పేపర్ లీకేజీల వెనుక ఎంతటి పెద్దవారు, ఏ నెట్‌వర్క్ ఉన్నా సరే వారికి కఠినాతికఠినమైన శిక్షలు పడాలని సీఎం రేవంత్ తన ట్వీట్ లో డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే ఈ వ్యవహారంలో పారదర్శకతో కూడిన విచారణ జరిపించాలని, వ్యవస్థల తప్పుల వల్ల అమాయక విద్యార్థులు మళ్లీ మళ్లీ నష్టపోకుండా చూడాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కష్టకాలంలో  విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సీఎం భరోసాను ఇచ్చారు. 

Also Read: దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!

కాగా మే 3 న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో జరిగిన నీట్ పరీక్షకు దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఈ పరీక్ష కోసం రాత్రింబగళ్లు ప్రిపేర్ అయ్యారు. కానీ, పేపర్ లీక్‌ కారణంగా  పరీక్ష రద్దు కావడంతో, ఇప్పుడు ఆ విద్యార్థులంతా ఆందోళనకు గురవుతున్నారు.

Also Read: హైకమాండ్ నిర్ణయంపై కేసీ వేణుగోపాల్ సంచలన కామెంట్స్