Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Bhagirath Bail Petition: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌.. హైకోర్టు కీలక నిర్ణయం!

Bhagirath Bail Petition
Bhagirath Bail Petition

Bhagirath Bail Petition: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో  తనకు ముందస్తు బెయిల్ కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కోర్టులో తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. పోక్సో కేసులో అరెస్ట్ నుండి మినహాయింపు ఇవ్వాలని భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు.. ఈ కేసులో కీలకమైన బాధితురాలి పుట్టినరోజు తేదీలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. బాధితురాలి వాదన వినకుండా.. మధ్యంతర బెయిల్ మీద నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.  మధ్యంతరం బెయిల్ పైన రేపు నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు..  ముందుస్తు బెయిల్ ను మరో వారానికి వాయిదా వేసింది. 

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

తప్పుడు కేసు పెట్టారు

బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కుట్రతో కూడుకున్నదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విధానంలోనే పలు అనుమానాలు ఉన్నాయన్నారు.  భగీరథ్ కుటుంబం నుండి రూ. 5 కోట్లు వసూలు చేసేందుకు జరిగిన బ్లాక్‌మెయిల్ పై కరీంనగర్‌లో తాము ముందే ఫిర్యాదు చేశామని, దానికి కౌంటర్‌గానే ఈ తప్పుడు కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే గతంలో నమోదైన ఒక కేసు రికార్డుల ప్రకారం బాధితురాలు మైనర్ కాదని, మేజర్ అని వాదించారు.

Also Read: దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!

“ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు అధికారికంగా రికార్డ్ చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో బాధితురాలు చెప్పిన మరికొన్ని వాస్తవాలు, జరిగిన అన్యాయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే చట్టప్రకారం సెక్షన్లను సవరించడం జరిగింది తప్ప ఇందులో ఎలాంటి కుట్ర లేదు” అని బాధితురాలి తరపు న్యాయవాది స్పష్టం చేశారు.