Thursday, May 21, 11:52
34.2 C
Hyderabad

Delhi Work From Home: ఢిల్లీలో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ .. త్రిపుర సంచలన నిర్ణయం!

Delhi Work From Home
Delhi Work From Home

Delhi Work From Home: మిడిల్ ఈస్ట్ యుద్ధం సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు,  ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల ఇంధనం, కార్యాలయాల్లో విద్యుత్ భారీగా ఆదా అవుతుంది. 

ఇకపై ప్రతి సోమవారాన్ని మండే మెట్రోగా ప్రకటించారు. ఆ రోజున మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఖచ్చితంగా మెట్రో రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఊరటనిస్తూ వారి రవాణా భత్యాన్ని 10 శాతం పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.రాబోయే ఆరు నెలల వరకు ప్రభుత్వం తరఫున పెట్రోల్, డీజిల్, లేదా ఎలక్ట్రిక్ వాహనాలతో సహా ఎలాంటి కొత్త కార్లను కొనుగోలు చేయకూడదని నిషేధం విధించారు.

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

సీఎం రేఖా గుప్తా తన అధికారిక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను ఏకంగా 60 శాతం తగ్గించి కేవలం నాలుగింటికే పరిమితం చేశారు. ఇందులో రెండు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు కావడం విశేషం. రాబోయే ఏడాది కాలం పాటు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏ మంత్రి గానీ, అధికారి గానీ ఎలాంటి అధికారిక విదేశీ పర్యటనలు  చేయకూడదని స్పష్టమైన బ్యాన్ విధించారు.

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

త్రిపుర ప్రభుత్వం కూడా

ఢిల్లీ లాగే త్రిపుర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనను తక్షణమే అమలులోకి తెచ్చింది.  సచివాలయం,  ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగులు రోజువారీగా కేవలం 50 శాతం మంది మాత్రమే ఆఫీసులకు హాజరవుతారు. మిగిలిన 50 శాతం మంది ఇళ్ల నుంచే పనిచేస్తారు.