
Khammam Teacher : ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న భూక్యా గౌతమి ఉదంతం కలకలం రేపుతోంది. గతంలో క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పే బాధ్యతను పక్కనపెట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, ప్రైవేటు సంస్థల ప్రమోషన్లలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఆమె సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ వ్యవహారంలో ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. టీచర్ గౌతమి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తనకు ఎదురైన చేదు అనుభవాలను, రాజీనామాకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఒక భావోద్వేగ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read : ఈ ఏడాది భారీ అగ్నిప్రమాదాలు.. అందరూ పోతారు : భవిష్యవాణిలో సంచలనం..
ఇన్‌స్టా రీల్స్ వివాదం.. టీచర్ సంచలన నిర్ణయం!
ఇన్స్టాగ్రామ్ రీల్స్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఖమ్మం మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల టీచర్ గౌతమి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ల ప్రమోషన్ వ్యవహారంలో 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఇటీవలే… pic.twitter.com/iUmS5tf1Ds
— RTV (@RTVnewsnetwork) August 3, 2026
ఈ వ్యవస్థలో గత 12 ఏళ్లుగా ఎంతో అంకితభావంతో పనిచేసి నిరుపేద పిల్లలకు విద్యనందించానని గౌతమి గుర్తుచేసుకున్నారు. ఎన్ని ఒత్తిడులు ఉన్నా పోరాటం చేసి పుస్తకాలు విరాళంగా ఇచ్చానని, ట్యూబ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వేలాది మంది పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించి, వారిని సర్కారీ బడుల్లో చేర్పించానని చెప్పారు. కానీ ఈ రోజు నిజాయితీగా కష్టపడే ఒక ఉపాధ్యాయురాలు ఓడిపోయిందని వాపోయారు. తెలియక చేసిన చిన్న తప్పుకు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్స్, సమాజంలో అవహేళనలు, చీదరింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు.
Also Read : తెలంగాణ పోలీసు శాఖలో భారీ నోటిఫికేషన్: 7,437 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

పాఠశాలలో కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులకు తగిన స్థానం లభించడం లేదని, తోటి ఉపాధ్యాయుల కుట్రలు, పన్నాగాలు, పొలిటిక్స్ నడిపేవారికే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. పిల్లల కోసం తాను చేసిన కష్టమే తనకొక శాపంగా మారిందని ఆవేదన చెందారు. తానెంతో నమ్మి తీసుకున్న ఈ రాజీనామా నిర్ణయం తనను భవిష్యత్తులో ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నానని, ప్రజలందరూ తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రస్తుతం గౌతమి షేర్ చేసిన ఈ భావోద్వేగ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.









