
ఇటీవల ఉక్రెయిన్‌లోని ఖెర్సన్ నగరంలో ఓ కూరగాయల వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ వెంటాడింది. 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి వ్యాన్ చుట్టూ డ్రోన్ తిరగడంతో దాని నుంచి తప్పించుకునేందుకు అతను ప్రయత్నించాడు. ఆ తర్వాత కొంత సమయానికి అతడి సమీపంలో డ్రోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి. అయితే ఈ డ్రోన్లు ఎలా దాడులు చేస్తాయి? ఇవి టార్గెట్స్‌ను ముందే గుర్తించి ఎటాక్ చేస్తుందా?
Also Read : ట్రంప్‌ను చంపాకే నేను చస్తా.. ఖమేనీ శపథం.. సుప్రీం లీడర్ అయ్యాక తొలి కీలక మీటింగ్!
కూరగాయల వ్యాపారిని వేటాడిన రష్యా డ్రోన్?
ఉక్రెయిన్‌లోని ఖెర్సన్ నగరంలో…
ఒక కూరగాయల వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని…
రష్యా డ్రోన్ వెంటాడినట్లు చెబుతున్న వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది.52 ఏళ్ల కూరగాయల వ్యాపారి…
తన వ్యాన్ చుట్టూ తిరుగుతూ
డ్రోన్ నుంచి తప్పించుకునేందుకు… pic.twitter.com/EdiWfkFCzb— Ravi Prakash Official (@raviprakash_rtv) August 5, 2026
డ్రోన్లు సాధారణంగా UAV (Unmanned Aerial Vehicle) లేదా లోహ విహంగాలుగా పనిచేస్తాయి. అయితే ఇవి గాలిలో ఎగరడానికి మోటార్లు, ప్రొపెల్లర్లు, ఫ్లైట్ కంట్రోలర్, రిమోట్ లేదా సముద్రమంత దూరంలో ఉండే శాటిలైట్ కంట్రోలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తాయి. సైనిక, ఆపరేషన్ అవసరాలకు ఉపయోగించే డ్రోన్లలో అత్యాధునిక ధర్మల్ కెమెరాలు, నైట్ విజన్ సెన్సార్లు, లేజర్ రేంజ్ ఫైండర్లు, రాడార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్వేర్ ముందే అమర్చి ఉంటారు. ఇవి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి ముందే ప్రోగ్రామ్ చేసిన రూట్ మేపింగ్ ఆధారంగా గగనతలంలో సైలెంట్‌గా ప్రయాణిస్తుంటాయి. కింద ఉన్న పరిసరాలను రికార్డు చేస్తూ సమాచారాన్ని అందిస్తుంటాయి. ఈ డ్రోన్లను యుద్ధాల్లో కూడా ఎక్కువగా వినియోగిస్తుంటారు.
Also Read : హెచ్-1బీ వీసా పై అమెరికా మరో షాక్… రెన్యువల్‌పైనా అదనపు ఫీజులు..?
ఆపరేషన్ సిందూర్ సమయంలో వీటిని బాగా ఉపయోగించారు. ఎందుకంటే సైనిక లేదా యాంటీ-టెర్రర్ ఆపరేషన్లలో సరిహద్దులు, కొండ ప్రాంతాలు లేదా దట్టమైన అడవుల్లో ప్రత్యక్షంగా సైనికులను పంపడం ఎంతో ప్రమాదకరం. అయితే డ్రోన్లలను ప్రధానంగా రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఫస్ట్ రైకానసిన్స్ అంటే శత్రువుల స్థావరాలను, వారి సంఖ్యను, కదలికలను రాత్రింబవళ్లు పసిగట్టడం. రెండవది కాంబ్యాట్/కమికాజే. అంటే లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి ఇచ్చే కమాండ్ ద్వారా లేదా పిన్ పాయింట్ క్లారిటీతో వెంటనే బాంబులను ఉపయోగించి శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం. ఇలా సైనికులకు ఎలాంటి ముప్పు లేకుండా దాడి చేయడంలో డ్రోన్లు ఉపయోగపడతాయి.
ఆధునిక సైనిక డ్రోన్లు మనుషులను, నిర్దిష్టమైన వ్యక్తులను గుర్తుపట్టి దాడి చేయగలవు. దీనికి AI మోషన్ ట్రాకింగ్, ఫేషియల్ రికగ్నిషన్, థర్మల్ ఇమేజింగ్ హెల్ప్ చేస్తాయి. ఒక వ్యక్తి ఎత్తు, నడక శైలి, ముఖ వైఖరి, శరీరం విడుదల చేసే వేడి ఆధారంగా డ్రోన్లోని ఏఐ అల్గోరిథం వ్యక్తిని గమనిస్తుంది. అయితే సాధారణ మనుషులకు, లక్ష్యంగా ఉన్న వ్యక్తికి మధ్య తేడాను గుర్తిస్తుంది. దీంతో ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఎటు కదిలినా కెమెరాతో కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూ దాడి చేయడానికి ఇవి రెడీ అవుతాయి. ఒకవేళ టార్గెట్ చేసిన వ్యక్తి ఇంట్లో లేదా బంకర్లో దాక్కుని ఉంటే, డ్రోన్లు వారి ఆధారాల కోసం వేచి చూస్తాయి. ఇంటి లోపల ఉన్నప్పుడు సాధారణ కెమెరాలకు కనిపించకపోయినా, ఇంఫ్రారెడ్, థర్మల్ కెమెరాల ద్వారా ఇంటి గోడల వెనుక ఉన్న ఉష్ణోగ్రత ఆధారంగా మనుషుల ఉనికిని డ్రోన్లు పసిగడతాయి. అవతల వ్యక్తి తలుపు తెరిచి బయటకు రాగానే.. ముందుగా సిస్టమ్‌లో ఉన్న డేటాతో బయటకు వచ్చిన వ్యక్తి రూపం, ముఖం, శరీర ఆకృతి సరిపోలుతుందో లేదో డ్రోన్ స్కాన్ చేస్తుంది.
డేటా మ్యాచ్ అయిన వెంటనే మైక్రో సెకన్లలో కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వెళ్లడం లేదా సిస్టమ్ అనుమతితో నేరుగా టార్గెట్‌పై దాడులు చేస్తుంది. అలాగే దాడి చేసే ముందు ఈ డ్రోన్ సిస్టమ్‌కు లేదా దానిని ఆపరేట్ చేసే ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఆపరేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇస్తారు. టార్గెట్ చేసిన వ్యక్తి ఫొటోలు, 3D ఫేషియల్ మ్యాపింగ్, ఉపగ్రహాల ద్వారా సేకరించిన జియో-లోకేషన్ కోఆర్డినేట్లు, అతను వేసుకునే దుస్తులు, ఉపయోగించే వాహనం సంఖ్య వంటి అన్ని వివరాలు ఉంటాయి. దీనికి తోడు శాటిలైట్లు, స్థానిక ఇంటెలిజెన్స్, మొబైల్ సిగ్నల్స్ ద్వారా వచ్చే రియల్ టైమ్ డేటాను కూడా డ్రోన్‌కు అనుసంధానిస్తారు. ఈ ముందస్తు వివరాలన్నీ సరిగ్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే డ్రోన్ క్షిపణిని ప్రయోగిస్తుంది.









