Horoscope 2026 Today
Horoscope 2026 Today

మేషం
పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడం మంచిది. సూర్యారాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.

వృషభం
ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. పనులు వేగంగా పూర్తవుతాయి. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం పఠించడం శ్రేయస్కరం.

మిథునం
పనుల్లో శ్రమ పెరిగినా ఏకాగ్రతతో విజయం సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ స్తోత్రం పఠించడం మంచిది.

కర్కాటకం
ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. నలుగురితో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి నిదానంగా ఉంటుంది. నవగ్రహ ప్రార్థన మేలు చేస్తుంది.

సింహం
ఉద్యోగంలో పురోగతి, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తాయి. వ్యాపార సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. కుటుంబంలో శాంతిని కాపాడుకోవడం ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

కన్య
దైవానుగ్రహం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సరియైన ప్రణాళికతో కృషి చేస్తే ఆర్థికాభివృద్ధి, ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

Also Read : ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

తుల
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ప్రార్థన శుభప్రదం.

వృశ్చికం
దైవబలం ఉండటంతో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. లక్ష్మీదేవిని ధ్యానించడం శ్రేయస్కరం.

ధనుస్సు
ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఆర్థికంగా లాభాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించండి.

మకరం
మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో గౌరవం, వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మహాలక్ష్మి ధ్యానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.

కుంభం
వ్యాపారంలో పురోగతి, మంచి లాభాలు కనిపిస్తాయి. పడ్డ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ సహనంతో పనులు పూర్తి చేస్తారు. నవగ్రహ ధ్యానం మంచిది.

మీనం
వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. లక్ష్మీదేవి నామస్మరణ చేయడం శ్రేయస్కరం.

Also Read : భూమిలో పాతిపెట్టిన రూ. 5 లక్షలు.. తీసి చూస్తే మైండ్ బ్లాంక్!