Delhi : ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఢిల్లీలో 1,777 హెచ్‌1ఎన్‌1 కేసులు నమోదయ్యాయని, ఆసుపత్రులను అప్రమత్తం చేశారు.

కోవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2 అంత వేగంగా ఇది వ్యాపించదు. దీనివల్ల వచ్చే అనారోగ్యం సాధారణంగా మితంగానే ఉంటుంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఈ వైరస్ ప్రభావం ఉండటం, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం వల్ల ప్రజల్లో దీనిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి కొంతవరకు పెరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : గణేశ్ ఉత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి!

H1N1 వైరస్‌ను మొదట 2009 ప్రారంభంలో మెక్సికోలో గుర్తించారు. ఈ వైరస్ జన్యువుల నిర్మాణం చాలా భిన్నమైనదిగా తేలింది. గత దశాబ్దాలుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలోని పందుల్లో, పక్షుల్లో, మనుషుల్లో వేర్వేరుగా తిరుగుతున్న జన్యువులు అన్నీ కలిసి, అంతకుముందు ఎన్నడూ చూడని కొత్త రూపంలోకి మారినట్లు పరిశోధకులు గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2009 జూన్ 11న దీనిని మహమ్మారిగా ప్రకటించింది. ఆ తర్వాత 2010 ఆగస్టు 10న మహమ్మారి దశ ముగిసినట్లు అధికారికంగా వెల్లడించింది. అప్పటి నుంచి ఈ వైరస్.. H3N2 , B/విటోరియా రకాలతో కలిసి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తిరిగే సాధారణ కాలానుగుణ ఇన్‌ఫ్లూఎంజా జాబితాలో చేరిపోయింది. ఈ మహమ్మారి మొదటి పన్నెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,84,500 శ్వాసకోశ, గుండె సంబంధిత మరణాలకు కారణమైందని అంచనా వేసింది.

Also Read : మీ కడుపులో పురుగులు పడతాయి.. మాజీ ఎమ్మెల్యే శాపనార్థాలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.