Eshwar Sai :  ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదం ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈశ్వర్ సాయి ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు బయటపెట్టారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ తనకు ఎలాంటి మందు తాగే అలవాటు లేదని, తాను ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే పది లక్షల రూపాయలు ఇస్తానని సవాల్ విసిరారు. తనకు వివాహం జరిగి ఏడేళ్లవుతోందని, తనకు అన్నం పెట్టిన జానపద రంగాన్ని తాను ఎప్పటికీ గౌరవిస్తానని, దాన్ని ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని కోరారు.

మాధురితో తనకు జరిగిన విషయం పూర్తిగా వ్యక్తిగతమని, దానికి ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని ఈశ్వర్ సాయి స్పష్టం చేశారు. పెళ్లి తర్వాత తనకు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినప్పటికీ, తన కొడుకు మీదొట్టు పెళ్లి తర్వాత మాధురితో తప్ప వేరే ఎవరితోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఇంట్లో గొడవల కారణంగానే తాను మాధురికి దగ్గరయ్యానని, ఆమె చూపే కేరింగ్ తనకు బాగా నచ్చిందని తెలిపారు. మాధురితో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, అయితే గత రెండు నెలలుగానే ఈ బంధం ఏర్పడిందని చెప్పారు. తాను చేసింది తప్పేనని అంగీకరిస్తూ, సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం పెద్ద పొరపాటని అన్నారు. ప్రస్తుతం తాను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నానని, బయటకు వెళ్లడానికే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాధురికి సారీ చెప్పడం తప్ప తాను ప్రస్తుతానికి ఏమీ చేయలేనని, తన భార్యకు కానీ మాధురికి కానీ అన్యాయం చేయాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు.

ఇదే సమయంలో తన భార్య తన రూమ్‌కు ఎలా వచ్చిందనే విషయం తనకు తెలియదని, ఎవరో డోర్ కొట్టి లోపలికి వచ్చారని ఈశ్వర్ సాయి తెలిపారు. ఆ డోర్ ఎవరు తీశారు, ఆ వీడియో తీసింది ఎవరో తాను చెప్పలేనని, కానీ ఆ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే ఈ వీడియోలు అప్లోడ్ చేశారని వెల్లడించారు. మాధురితో తనకు మధ్య చాలా చర్చలు జరిగాయని, వాటిని తాను బయటపెట్టలేనని అన్నారు. ఈ సందర్భంగా ఇల్లీగల్ రిలేషన్స్ ఎవరూ పెట్టుకోవద్దని, ఎప్పటికైనా నిజాలు బయటపడతాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. జీవితం చాలా చిన్నదని ఇలాంటి పనులు చేయవద్దని తెలిపారు.

కాగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌లు కలిసి ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం, దీనికి సంబంధించిన వీడియోలు, వాదనలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్‌చల్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.