ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉండి, నిత్యం వార్తల్లో నిలిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తించిన ఆయన, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో నోటిఫికేషన్ల సునామీ.. 10,060 ఉద్యోగాల వేట షురూ!

పాలనా పరమైన వ్యవహారాలలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు, ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత వంటి అంశాలు ఆ సమయంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వైఖరిపై స్పందించిన ఆయన, అనంతరం సర్వీసు నుంచి తప్పుకున్నారు. తాజాగా తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అడుగుపెట్టారు.

ఐఐటీ కాన్పూర్ చదువుకున్న ప్రవీణ్ ప్రకాశ్, టెక్నాలజీ లేదా కార్పొరేట్ రంగంలో పెద్ద అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకున్నానని చెప్పారు. దేశంలో ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ పరిరక్షణ ముఖ్యమని, ఆ మార్గం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని ఆయన నమ్ముతున్నారు.

మొదట కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఉన్న పరిచయాల వల్ల ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read : ఇండియన్ స్టూడెంట్స్‌కు గూగుల్ గుడ్ న్యూస్.. ఏడాది పాటు ఉచితంగా గూగుల్ ఏఐ ప్లస్..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.