West Godavari :పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరగవరం(మం) ఐతంపూడి లాకుల దగ్గర అదుపు తప్పిన కారునరసాపురం కాలువలోకి దూసుకెళ్లింది. కారు ప్రమాదం సమయంలో అందులో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు గల్లంతవ్వగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతదేహాలు లభ్యం కాగా, మరోకరి మృతదేహం లభించలేదు. మృతులంతా నరసాపురానికి చెందిన బీటెక్‌ విద్యార్థులుగా గుర్తించారు. వీరంతా పెరవలిలో ఫ్రెండ్‌ పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ఇరగవరం(మం) ఐతంపూడి లాకుల మలుపు దగ్గర ఎలాంటి ఇండికేషన్ లేకపోవడంతో గమనించని విద్యార్థులు కారును అదే స్పీడుతో నడపడంతో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుస్వంత్ (18), పోతుల లక్ష్మీబాను (18) రాజారాం (17) నాగబత్తుల సాయి సూర్య (18) సాయి (18) మృతి చెందారు. కారులో నుంచి నీటి పడిన పడిపోయిన మరో విద్యార్థి మట్టా సంతోష్‌ చెట్టుకొమ్మ పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. అతను కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అతన్ని రక్షించారు. పెరవలిలో పెళ్లికి వెళ్లి తిరిగి తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోతుల లక్ష్మీభాను, నాగిరెడ్డి దుస్వంత మృతదేహాలను ఆదివారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. కాగా మృతుల్లో లక్ష్మీభాను స్వస్థలం కోనసీమ జిల్లా మల్కిపురం మండలం మోరి గ్రామంగా స్థానికులు తెలిపారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.