
Fire Accident : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ మూలంగా ఎస్‌ఎన్‌సీయూ వార్డులో రాత్రి పూట మంటలు చెలరేగాయి. దీని కారణంగా పిల్లల వార్డులో ఒక్కసారిగా ఏసీ పేలింది. దీంతో వార్డంతా పొగలు కమ్ముకున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు భయాందోళనలకు గురై తమ పిల్లలను తీసుకొని బయటకు పరుగందుకున్నారు. స్పందించిన సిబ్బంది వెంటనే వార్డులోని చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం సమయంలో వార్డులో 27 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : కోకాపేట వేలానికి సింగిల్ బిడ్.. రద్దు చేసిన హెచ్‌ఎండీఏ
ఈ ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని శాంతినగర్‌కు చెందిన ఐదు రోజుల శిశువుతో పాటు మరో చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. దట్టంగా పొగ అముముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అక్కడి సిబ్బంది వెంటనే వార్డుకు విద్యుత్తు సరఫరా నిలిపి వేసి.. అందులోని పసి పిల్లలను పక్క వార్డుకు తరలించారు. ఈ ఘటనలో గాయాలపాలైన 27 మంది పిల్లలను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ అఖిల్ మహాజన్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు స్పాట్ డెడ్?









