
Youtuber Vaishnavi Case : యూట్యూబర్ వైష్ణవి హత్య తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. యూట్యూబర్‌గా సుమారు 50 వేల మంది ఫాలోవర్స్‌ను కలిగిన వైష్ణవి హత్యను ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించారు. మార్చి 17న వైష్ణవిని ఆమె భర్త హరిబాబు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయగా కరెక్ట్ ఆరునెలలకు అదే 17న (సెప్టెంబర్ 17న) హరిబాబును వైష్ణవి అన్న దారుణంగా నరికి చంపాడు. అయితే ఇద్దరి మధ్య 17 సెంటిమెంట్ ఏంటీ అనే చర్చ సర్వత్రా వ్యక్తమవుతోంది.
మార్చి 16 అర్థరాత్రి వైష్ణవికి, హరిబాబుకు మధ్య వరకట్నం విషయంలో వివాదం చెలరేగింది. అప్పటికి వైష్ణవి నాలుగు నెలల గర్భవతి. ఈ క్రమంలో సహానం కోల్పోయిన హరిబాబు వైష్ణవి గొంతుపిసికి చంపే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె స్పహ కోల్పోయింది. అనంతరం ఇంట్లో ఉన్న కత్తితో ఆమె కడుపులో నుదిటిపై పొడిచి హరిబాబు పారిపోయాడు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం ఆరునెలలు గడిచిపోయింది. అయితే వైష్ణవి హత్య జరిగిన రోజే తమ చెల్లిని చంపిన హరిబాబుకు తగిన శిక్ష పడాలని లేదంటే తాము ఏం చేయాలో అదే చేస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. అంతా మరిచిపోయారనుకుంటున్న సమయంలో మరోసారి వైష్ణవి హత్య వెలుగులోకి వచ్చింది. కారణం వైష్ణవి భర్త హరిబాబు హత్య.
Also Read : దేశ రాజధానిలో దారుణం.. మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
హరిబాబు హత్య ఎలా జరిగింది ? అసలు అక్కడ ఏం జరిగింది? సంతోష్ ఎక్కడి నుంచి హరిబాబును ఫాలో అయ్యాడు? ఎన్ని కిలోమీటర్ల నుంచి హరిబాబును వాచ్ చేస్తూ వచ్చాడు? –కారులో ఎంత మంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు?అసలు హరిబాబు అక్కడికి ఎందుకొచ్చాడు? సంతోష్ కారును ఎవరు ఫాలో అయ్యారు?ఆ 23 సెకన్లలో ఏం జరిగింది? హరిబాబును చంపడానికి ఎన్నిరోజుల నుంచీ రెక్కీ చేశారు? అనేవి ఇపుడు సంచలన ప్రశ్నలుగా మిగిలాయి. అయితే వైష్ణవి అన్న సంతోష్ చెప్పిన వివరాల ప్రకారం పనిమీద తను నిజామాబాద్ వెళ్లానని అక్కడ అనుకోకుండా హరిబాబు తారసపడ్డాడని హత్య చేశానని చెప్తున్నాడు. అయితే ఇది అంతా ఈజీగా నమ్మె విషయం కాదు. ఎందుకంటే అనుకోకుండా చంపితే తన చేతిలో కత్తి ఎక్కడ నుంచి వస్తుంది. అలాగే అతన్ని ఇన్నాళ్లు ఫాలో కాకుండా ఉంటే హరిబాబు ఎక్కడ ఉంటున్నది ఎలా తెలుస్తుంది అనేది ప్రశ్నార్థకం. సంతోష్ భార్య చెప్పిన వివరాలను బట్టి వైష్ణవి హత్య జరిగినప్పటి నుంచి వారి కుటుంబం పగతో రగిలిపోతుంది. అందులో సంతోష్ తన చెల్లిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నాడు. సమయం వస్తే హరిబాబును చంపాలన్న కసితో ఉన్నాడు. సో.. దీన్ని బట్టి సంతోష్ ముందుగానే ప్లాన్ ప్రకారం హరిబాబును చంపాలనే ఉద్దేశంతోనే అతని కదలికలపై కన్నేసి సమయం చిక్కడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.
మార్చి 17 రాత్రి వైష్ణవి దారుణ హత్య జరగగాసెప్టెంబర్ 17 వైష్ణవి భర్త హరిబాబును సంతోష్ చంపాడు.ఇద్దరి హత్యల మధ్య 17 సెంటిమెంట్ ఏంటి? వైష్ణవి హత్య తర్వాత సరిగ్గా ఆర్నెళ్లలో అదే తేదీన సంతోష్ హరిబాబును చంపడం యాదృచ్చికమా? లేక ఫక్కా ప్లానా అనేది పక్కన పెడితే..వారి అంచనా ప్రకారం వైష్ణవి హత్య తరువాత హరిబాబు కుటుంబం జైలుపాలయింది. వారికి బెయిల్ రావడానికి 3 నెలల కాలం పడుతుంది. ఆ తర్వాత వారు వారి ఇంటికి వస్తారు. ప్రాణ భయంతో రాకుంటే ఎక్కడో ఒకచోట తలదాచుకుంటారని సంతోష్ అంచనా వేసి ఉంటాడు. ఈ క్రమంలోనే హరిబాబు ఆచూకీ కోసం గాలించినట్లు తెలుస్తోంది. దీంతో బెయిల్ పై బయటకొచ్చి మొక్కజొన్న కంకులు అమ్ముతూ బతుకుతున్న హరిబాబు కుటుంబం నిజామాబాద్ లో స్థిరపడింది. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి హరిబాబు కదలికలను గమనిస్తున్న సంతోష్ కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17కు సరిగ్గా ఆరునెలలు కావడంతో అదే రోజున ఎలాగైన హరిబాబును చంపాలనుకున్న సంతోష్ హత్యకు హత్యతోనే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం –8 సెకన్లలో 9 కత్తిపోట్లతో హరిబాబును –కొబ్బరిబొండాలు నరికే కత్తితో కసితీరా నరికిన సంతోష్ ఆరునెలల కాలంలోనే తన చెల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కలకలం రేపుతోంది.
Also Read : 38 గుంటల భూమి కోసం రక్తపాతం.. పంచాయతీ ఆఫీసులో తండ్రి, కూతురు హత్య!









