manipur

BIG BREAKING :  మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో తీవ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణ ఘటనలో మరికొంతమంది సైనికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఉఖ్రుల్ ప్రాంతంలో జవాన్ల కాన్వాయ్‌ లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసిన ఉగ్రవాదులు, ఒక్కసారిగా పేలుళ్లకు పాల్పడుతూ భారీగా కాల్పులు జరిపారు.

ఈ ఘోర ప్రమాదంపై మణిపూర్ గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండించారు. “ఈ రోజు ఉఖ్రుల్‌లో జరిగిన అంబుష్ దాడిలో ఇద్దరు ధైర్యవంతులైన అస్సాం రైఫిల్స్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి హింసాత్మక దాడులకు మన సమాజంలో ఏమాత్రం స్థానం లేదు. శాంతిభద్రతలను కాపాడాలనే మన అందరి సమిష్టి సంకల్పాన్ని ఇటువంటి దాడులు ఎంతమాత్రం బలహీనపరచలేవు” అని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ తీరని దుఃఖ సమయంలో ఆ కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించారు. అలాగే, ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అదనపు బలగాలను రంగంలోకి దించి, ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.