
మేషం
మీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగండి. వ్యాపారానికి అనుకూల సమయం. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సూర్యారాధన మేలు చేస్తుంది.
వృషభం
ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి.
మిథునం
మనోబలంతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి.
కర్కాటకం
అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. పట్టుదలతో పనిచేస్తే మంచి పేరు వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దల సలహాలు పాటించండి. నవగ్రహ ఆరాధన శ్రేయస్కరం.
సింహం
ప్రతి పనిలోనూ పట్టుదల, ముందుచూపు అవసరం. ఏకాగ్రత లోపిస్తే పనులు చెడిపోయే ప్రమాదం ఉంది. అజాగ్రత్తగా ఉండకండి. నవగ్రహ ధ్యానం శుభం కలిగిస్తుంది.
కన్య
పనులు వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయండి. ఆఫీసులో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రమంగా సమస్యలు తగ్గి, ధైర్యం పెరుగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోండి.
Also Read : ఎకో స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్‌లపై భారీ తగ్గింపులు.. అస్సలు మిక్ కావద్దు!
తుల
ఈరోజు మీకు చాలా బాగుంది. ఏ పని చేసినా త్వరగా పూర్తవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది.
వృశ్చికం
ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఒక ముఖ్యమైన సమస్య తీరుతుంది. సమయానికి సహాయం అందుతుంది. దుర్గాదేవి నామస్మరణ చేసుకోండి.
ధనుస్సు
కొంచెం శ్రమిస్తేనే ఫలితాలు దక్కుతాయి. ఇతరుల సహాయం అందుతుంది. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తపడండి. దుర్గా స్తోత్రం చదవడం మేలు చేస్తుంది.
మకరం
వృత్తి, ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. కుటుంబంలో శుభవార్త వింటారు. శివారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
కుంభం
ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. దైవబలం తోడుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నమ్మకంతో ముందడుగు వేయండి. లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.
మీనం
ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల మద్దతు లభిస్తుంది. మానసిక ఉల్లాసం, భోజన సౌఖ్యం కలుగుతాయి. ఈశ్వరధ్యానం శుభకరం. – Zodiac Signs
Also Read : పాక్ స్కెచ్‌ను తిప్పికొట్టిన భారత్.. ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్!









