ఐఫోన్ 13 మినీ మాదిరి మార్కెట్‌లోకి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఎనఫ్ అనే కంపెనీ Enough Phone అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో కాంపాక్ట్ 5.3-అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌తో పనిచేసే ఈ ఫోన్ 8GB RAMను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 3500mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా ఉంది. ఇది 5G కనెక్టివిటీతో వస్తుంది. ఫిజికల్ సిమ్‌తో పాటు eSIM ఇన్‌స్టాల్ చేసుకునే ఆప్షన్‌ను కూడా అందించారు. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Enough Phone ధర దాదాపు రూ. 42,000గా కంపెనీ నిర్ణయించింది. దీనిని ఎర్లీ బర్డ్ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌తో పాటు గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్‌, USB-C కేబుల్‌ను అందిస్తోంది. ఇది అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది.

Enough Phone Features

Enough Phone 1520 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, కాంపాక్ట్ 5.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. స్టోరేజ్‌ను విస్తరించుకోవడానికి ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా ఉంది. ఇది సోనీ IMX766 సెన్సార్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం.. ఇందులో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్‌లో 3,500mAh సామర్థ్యం గల రిమూవబుల్ బ్యాటరీ ఉంది.