
Gen Z : భారత రాజకీయాల్లో త్వరలో పెద్ద మార్పు రాబోతోంది. నీట్ పేపర్ లీక్ వివాదం సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ వంటి పరిణామాలు.. యువత ఇకపై మౌనంగా ఉండరని తేల్చిచెప్పాయి.
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ వివాదం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో కొత్త మలుపు తెచ్చింది. దేశంలోని యువత (18 నుంచి 32 ఏళ్ల వయస్సు వారు) గొంతును ప్రభుత్వాలు ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించలేవని ఈ మొత్తం ఘటన స్పష్టం చేసింది. పరీక్షల్లో పారదర్శక వ్యవస్థ కావాలనే డిమాండ్‌తో మొదలైన నిరసన, చూస్తుండగానే ప్రభుత్వ జవాబుదారీతనం, విద్యా వ్యవస్థపై పెద్ద ఉద్యాలంగా మారింది. ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించే నేటి యువత ఎంత వేగంగా జాతీయ రాజకీయాల దిశను మార్చగలదో ఈ ఘటన చూపించింది.
2029 ఎన్నికల్లో యువతే అత్యంత బలమైన శక్తిగా నిలవనుంది. నాటి ఎన్నికల నాటికి 18 నుంచి 32 ఏళ్ల వయస్సు గల యువత అతిపెద్ద ఓటర్లుగా మారనుంది. దేశంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఈ ఓటు బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంది. జనాభా లెక్కల ప్రకారం.. 2029 నాటికి 18 నుండి 32 సంవత్సరాల వయస్సు గల యువకుల సంఖ్య దాదాపు 38 కోట్లకు చేరుకోవచ్చు. ఇందులో దాదాపు 19.9 కోట్ల మంది పురుషులు, 18.1 కోట్ల మంది మహిళలు ఉంటారు.
ఈ యువవర్గం భారతదేశంలోనే అత్యంత పెద్ద ఓటర్ల సమూహంగా అవతరిస్తుంది. అంతేకాకుండా, 2029 నాటికి సుమారు 35.7 కోట్ల మంది జనాభా ఉండనున్న తమకంటే పెద్ద వయస్సువారిని (33 నుంచి 45 సంవత్సరాల వాయిసు వారు) ఇది వెనక్కి నెట్టి ముందుకు వస్తుంది. ఈ యువ వర్గంలో అత్యధికంగా విద్యార్థులు, మొదటిసారి ఓటు వేస్తున్నవారు, ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్నవారే ఉంటారు. అందుకే రాబోయే ఎన్నికల్లో సంప్రదాయ అంశాలతో పాటు ఉపాధి, మెరుగైన విద్య, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం , పర్యావరణం, పారదర్శక పాలన వంటి అంశాలే ప్రథమ స్థానంలో ఉంటాయి.
Also Read : వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు
ఈ 18 నుంచి 32 ఏళ్ల యువత వెనుక పిల్లల పెద్ద జనాభా కూడా ఉంది. అయితే 2029 నాటికి వారు ఓటు వేసే వయస్సు కంటే చిన్నవారే అయినప్పటికీ.. 41.7 కోట్ల సంఖ్యతో వారు దేశంలోనే అతిపెద్ద వయస్సు వర్గంగా ఉంటారు. దేశ మొత్తం జనాభాలో యువత శాతం గతంతో పోలిస్తే కొద్దిగా తగ్గింది. ఎందుకంటే దేశంలో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 1988లో మొత్తం ఓటర్లలో 18 నుంచి 29 ఏళ్ల యువత వాటా 38.3 శాతంగా ఉండేది. ఇది 2024 నాటికి 30.1 శాతానికి పడిపోయింది. ఇక 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఈ వాటా మరింత తగ్గి 27.8 శాతానికి చేరుకోనుంది. అంటే దశాబ్దం చివరి నాటికి ప్రతి 4 మందిలో దాదాపు ఒక ఓటరు మాత్రమే 18 నుంచి 29 సంవత్సరాల వయస్సులో ఉంటారు.
దేశంలో పిల్లల నిష్పత్తి తగ్గుతుండగా, మధ్య వయస్కులు, వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. పురుషులలో ఈ భాగం 1989లో 45.2 శాతం ఉండగా, 2029 నాటికి 27.8 శాతానికి పడిపోతుందని అంచనా. అలాగే మహిళల్లో కూడా ఇది 44.8 శాతం నుండి 27.3 శాతానికి తగ్గిపోనుంది. 46 నుంచి 61 సంవత్సరాల వయస్సు గల వారి వాటా దాదాపు 18 శాతానికి చేరుకుంది. అలాగే 62 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల జనాభా రెట్టింపు దాదాపు 10 నుండి 11 శాతానికి చేరుకుంటుందని అంచనా వేయబడింది.
నీట్ పేపర్ లీక్ ఘటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో మొదలైన ఉద్యమం కేవలం పరీక్షా పత్రం లీకేజీకి మాత్రమే పరిమితం కాలేదు. ఇది భారతదేశ కొత్త తరపు రాజకీయ అడుగులకు ఒక గట్టి సంకేతంగా మారింది. 2029లో భారత్ తన తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో, సరిగ్గా ఈ 38 కోట్ల మంది యువతే ప్రభుత్వ ఏర్పాటులో కీలక శక్తిగా మారుతారు.
Also Read : మార్కెట్‌లో కొత్త సరుకు: iPhone స్టైల్లో పోకో నుంచి కిర్రాక్ మొబైల్..!









