మేషం
పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ బాధ్యతలు, అధికారం పెరుగుతాయి. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక బలం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం మంచిది.

వృషభం
మానసిక ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది.

మిథునం
అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. స్నేహితులు, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనలాభం, వస్త్రలాభం సూచిస్తున్నాయి. గోవింద నామాలు స్మరిస్తే మంచిది.

కర్కాటకం
ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి ప్రగతికి సంబంధించిన మంచి వార్తలు అందుతాయి. ముఖ్యమైన పనుల కోసం పెద్దల సహాయం తీసుకుంటారు. లక్ష్మీదేవి అష్టోత్తరం చదవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి.

సింహం
కష్టపడి పనిచేస్తేనే పనులు పూర్తవుతాయి. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కన్య
చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కొత్తగా మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనలు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. లక్ష్యాలను సాధించడంలో ఆత్మీయుల మద్దతు లభిస్తుంది. గురువును ధ్యానించడం మంచిది.

తుల
బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ మీ రంగాలలో ఒత్తిడి పడకుండా చూసుకోండి. ముఖ్యమైన పనులలో సహనం చాలా ముఖ్యం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదవడం ఉత్తమం.

వృశ్చికం
పనులను ప్రణాళిక ప్రకారం చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరమైన సమయానికి సహాయం చేసేవారు దొరుకుతారు. బంధువుల కలయిక ఆనందం ఇస్తుంది. ఆస్తి వ్యవహారాలు కలిసివస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించుకోండి.

ధనుస్సు
మీ రంగాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. దైవబలం తోడుగా ఉండటం వల్ల మీ ఆశయాలు నెరవేరుతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంది. లక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

మకరం
చేపట్టిన పనులలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఒక మంచి వార్త మీలో ధైర్యాన్ని నింపుతుంది. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకోకండి. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల అంతా శుభం జరుగుతుంది.

కుంభం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలు పడకుండా శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యస్వామిని దర్శించడం మేలు చేస్తుంది.

మీనం
మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తిగా నెరవేరుతాయి. మానసిక బలం, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది.