Hero Splendor
Hero Splendor

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో టూవీలర్ తయారీ కంపెనీ హీరో దూసుకుపోతోంది. ధర తక్కువ, మైలేజీ ఎక్కువ కారణంగా సామన్య ప్రజలు ఎక్కువగా ఈ బైక్‌లపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2027 మొదటి ఆరు నెలల్లో హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన ‘హీరో స్ప్లెండర్’ బైక్.. అమ్మకాల పరంగా అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఏకంగా 21 లక్షలకు పైగా (21,30,637 యూనిట్లు) అమ్ముడై భారతదేశంలోనే అత్యధికంగా సేల్ అయిన బైక్‌గా ఇది రికార్డు సృష్టించింది.

Also Read : లావా దీపావళి సేల్.. స్మార్ట్‌ఫోన్లు, కీప్యాడ్ మొబైల్స్‌పై బంపరాఫర్లు

మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దీని అమ్మకాలు.. సుమారు 19.69% పెరిగాయని కంపెనీ తెలిపింది. ఇక దేశంలోని మొత్తం బైక్‌ల మార్కెట్ వాటాలో 30.75% ఈ hero splendor బైక్ దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ బైక్ ధర తక్కువగా ఉండటం, అధిక మైలేజీ ఇవ్వడమే దీని అధిక సేల్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

దీని ఎక్స్ షోరూమ్ ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ.77,750 నుండి ప్రారంభమై రూ.84,000 వరకు ఉంది. మరోవైపు పెట్రోల్ ధరలు అధికంగా పెరుగుతున్న తరుణంలో.. ఈ హీరో స్ప్లెండర్ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 నుండి 73 కి.మీ మైలేజీ ఇస్తుందని వినియోగదారులు, నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగానే మధ్యతరగతి కుటుంబం ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది.

ఈ hero splendor బైక్‌ 97.2 సిసి ఎయిర్-కూల్డ్, BS6 ఫేజ్-2 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 7.91 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ట్రాఫిక్‌లో ఆటోమేటిక్‌గా ఇంజిన్ ఆఫ్ అయి పెట్రోల్‌ని ఆదా చేసే ‘i3S టెక్నాలజీ’ (Idle Start-Stop System)ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో డిజిటల్-అలాగ్ స్పీడోమీటర్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: DA 3 శాతం పెంపు