
ప్రముఖ టూ వీలర్ వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్‌లో అదిరిపోయే బైక్‌లను లాంచ్ చేసింది. దసరా, దీపావళి పండుగ వేళ ఏకంగా రెండు సరికొత్త బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి Hero Xtreme 160R 4V, Hero Xtreme 250R మోడళ్లు. ఈ రెండు బైక్‌లు అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ రెండింటిలోనూ రైడ్-బై-వైర్ థ్రాటిల్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ TFT డిస్‌ప్లే వంటి అడ్వాన్స్‌డ్ ఫెసిలిటీస్‌ను అందించారు. ఇప్పుడు ఈ రెండు బైక్‌ల ఫీచర్లు, ధరల గురించి తెలుసుకుందాం.
Hero Xtreme 160R 4V Features
Hero Xtreme 160R 4V బైక్ అద్భుతమైన డిజైన్, బాడీని కలిగి ఉంది. ఇందులో సైబర్ షార్ప్ స్టైలింగ్, న్యూ బాడీ ప్యానెల్స్ అందించారు. అలాగే LED హెడ్‌లాంప్స్, ‘H’ ఆకారంలో ఉండే DRL, ప్రాజెక్టర్ హై-బీమ్, ‘H’ డిజైన్ LED టైల్ లాంప్స్‌ను ఈ బైక్‌లో చేర్చారు. ఇది రెడ్ అండ్ బ్లాక్ ఫ్రంట్ వీల్ రిమ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ Hero Xtreme 160R 4V బైక్‌లో 163cc ఆయిల్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 16.9 HP పవర్, 14.6 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో ఈ బైక్ 4.4 సెకన్లలోనే 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో అందించిన TFT స్క్రీన్ ద్వారా మైలేజ్, గేర్ పొజిషన్‌ను తెలుసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేయడం ద్వారా నావిగేషన్, ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు.
Hero Xtreme 250R Features
ఈ బైక్ ఫుల్ పవర్ అండ్ టార్క్‌తో వస్తుంది. ఇది 250 cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 29.6 HP పవర్, 25.3 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో ఈ బైక్ 3.2 సెకన్లలోనే 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
Xtreme 160R 4V – 250R Prices
ఇక వీటి ధరల విషయానికొస్తే.. Hero Xtreme 160R 4V ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.27 లక్షలు కాగా.. Hero Xtreme 250R ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.98 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి.









