Motorola Edge 70 Max
Motorola Edge 70 Max

మోటోరోలా తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70 Maxను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32- మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,100mAh బ్యాటరీ ఉంది.

Motorola Edge 70 Max Price

Motorola Edge 70 Max ఫోన్‌లోని 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 కాగా, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. ఈ ఫోన్ జూలై 20 నుండి భారతదేశంలోని Motorola అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో సేల్‌కి అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్లలో భాగంగా రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తున్నాయి. 18 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. ప్రారంభంలో ఈ ఫోన్ ఆఫర్లతో రూ.49,999, రూ.54,999 ధరలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ పాంటోన్ ఆక్వా గ్రే, పాంటోన్ డార్క్ షాడో, పాంటోన్ ఐస్ మెల్ట్ కలర్‌లలో లభిస్తుంది.

Motorola Edge 70 Max Specifications

Motorola Edge 70 Maxలో 1440×3168 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 7000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కూడిన 6.8-అంగుళాల క్వాడ్ HD+ 2K ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది హలో UXతో ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. Motorola Edge 70 Max ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్, 25W Qi2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,100mAh బ్యాటరీని కలిగి ఉంది. వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, సెల్ఫీలు కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది AI -ఆధారిత ఇమేజింగ్ ఫీచర్లతో వస్తుంది.