Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరాముడి రూపంలో చూపిస్తూ కొందరు వ్యక్తులు పూజలు, హారతులు ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో పీఎం మోదీని శ్రీరాముడి అవతారంలో ఉన్న ఒక పెద్ద కటౌట్‌గా తయారు చేశారు. నీలిరంగు దుస్తులు, బంగారు కిరీటం, చేతిలో విల్లు, మెడలో పూలమాల, కిరీటంలో నెమలి పించంతో మోదీ రూపాన్ని రూపొందించారు. కాషాయ బట్టలు ధరించిన ఒక వ్యక్తి మోదీ చాలీసా పాడుతుండగా, చుట్టూ ఉన్న ప్రజలు గంటలు వాయిస్తూ, చప్పట్లతో జై జై మోదీ, హర్ హర్ మోదీ అని భక్తిశ్రద్ధలతో హారతి ఇస్తూ కనిపించారు. బిహార్ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో జరిగినట్లు చెబుతున్న ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు కూడా పాల్గొన్నారు.

Also Read : ముంబైలో ఘోరం.. ఇళ్లపై కుప్పకూలిన భారీ క్రేన్‌

ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ ప్రెస్ క్లబ్ స్పందించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం కోసం తమ హాల్‌ను అద్దెకు తీసుకుందని తెలిపింది. అయితే, హాల్ వినియోగానికి సంబంధించిన నిబంధనలను ఆ సంస్థ ఉల్లంఘించడంతో, ప్రెస్ క్లబ్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారని స్పష్టం చేశారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను చూడగా, వేలాది మంది షేర్ చేశారు. రాజకీయ నాయకులను దేవుడి స్థానంలో చూపించడం హిందూ నమ్మకాలను, ఆచారాలను అవమానించడమేనని చాలామంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులను నమస్కరించవచ్చు కానీ ఇలా భగవంతుడిగా పూజించడం సరైన పద్ధతి కాదని కామెంట్లు చేస్తున్నారు.

Also Read : పాకిస్తాన్‌కు భారత్ బిగ్ షాక్: ఢిల్లీలో బారికేడ్ల తొలగింపు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.