Raviprakash

_ Ravi Prakash

ఒక మర్డర్. రెండు ఆర్టికల్స్‌. దేశమంతా రచ్చ. ఇప్పుడు భారతదేశంలో అసలు ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని ఒక అన్‌కంఫర్టబుల్ క్వశ్చన్ సమాజం ముందుకు వచ్చింది. అసలు జర్నలిస్టు పరిధి ఏంటి..? ఒక ఒపీనియన్ రైటర్, నడుస్తున్న మర్డర్ కేసులో నిందితుడి మైండ్‌సెట్‌ని అనలైజ్ చేయొచ్చా? అసలు క్రైమ్‌ని జస్టిఫై చేస్తున్నట్టు అనిపించకుండా, ఆ పరిస్థితుల గురించి సోషల్ కామెంట్ చేయొచ్చా? ఒకరిపై చూపే ఎంపతీ, బాధితుల పట్ల డిస్రెస్పెక్ట్ లా ఎప్పుడు మారుతుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను రెండు వర్గాలుగా విడగొట్టాయి. ఇది కోర్టు తీర్పు గురించి కాదు, పోలీసుల కొత్త ఆధారాల గురించి అస్సలు కాదు. ఇది ఇండియాలోని ఇద్దరు పెద్ద రైటర్స్‌… శోభా డే, చేతన్ భగత్‌… ఒకే కేసుని తీసుకుని, సోషల్ మీడియాలో నిప్పులు చేరిగిన కథనాల గురించి మాత్రమే.

ఈ వివాదంలో ఒక వర్గం ఏమంటుందంటే.. వాళ్లు సొసైటీలోని కుళ్లుని, అరేంజ్డ్ మ్యారేజ్ కష్టాలను బయటపెడుతున్నారని సమర్థిస్తోంది. మరో వర్గం మాత్రం.. వీళ్లు బాధితుడిని వదిలేసి, అనవసరమైన విషయాలతో ఎథిక్స్ క్రాస్ చేస్తున్నారని మండిపడుతోంది. అయితే మనం ఇక్కడ ఎవరికీ శిక్షలు వేయట్లేదు, అసలు ఈ గొడవ ఎందుకు జరిగిందో మాత్రమే డీకోడ్ చేస్తున్నాం. మున్ముందుకు వెళ్లేముందు ఒక క్లారిటీ ఏంటంటే.. సియా గోయల్, చేతన్ చౌదరిలపై కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. దీన్ని కోర్టు తేల్చాలి. చట్ట ప్రకారం తప్పు రుజువయ్యే వరకు ఎవరైనా అమాయకులే. కాబట్టి ఇది ట్రయల్ కాదు, జస్ట్ రియాలిటీ చెక్ మాత్రమే.

అసలు ఏం జరిగిందంటే.. జూన్ 18న లోహగడ్ కోట వద్ద పూణే బిజినెస్‌మెన్ కేతన్ అగర్వాల్ లోయలో పడి చనిపోయాడు. మొదట్లో అంతా దీనిని ఒక ‘ప్రమాదం’ అనుకున్నారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడంతో అది ‘మర్డర్’ కేసుగా మారింది. ఇప్పుడు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ క్రిమినల్ కాన్సిపిరసీ కేసులో ఇరుక్కున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. కానీ దేశంలోని ప్రముఖ రైటర్స్ కలం పట్టుకునేసరికి, ఇది ఒక కల్చరల్ వార్‌గా మారిపోయింది.

ముందుగా రైటర్‌ శోభా డే అనాలిసిస్ చూస్తే.. ఆమె రాసిన ఆర్టికల్ టైటిల్ “Arranged Marriage, Gen Z and a Hair Patch – The Twisted Ketan Agarwal Murder Case.” శోభా డే ఇందులో కేవలం రిపోర్టింగ్ చేయలేదు, సబ్జెక్ట్ లోకి డీప్‌గా వెళ్లారు. Gen Z, అరేంజ్డ్ మ్యారేజ్, పేరెంట్స్ ప్రెజర్ గురించి ప్రస్తావించారు. కానీ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అండ్ వివాదాస్పదమైంది ఏంటో తెలుసా? కేతన్‌ హెయిర్ ప్యాచ్! కేతన్‌ హెయిర్ ప్యాచ్ పెట్టుకోవడమే పెద్ద నేరం అన్నట్టు శోభా రాసిన పాయింట్ ఉంది. అంతటితో ఆగకుండా, వెటకారంగా.. సియా ఆ మర్డర్ చేసే బదులు, సల్మాన్ ఖాన్‌ని అడిగి హెయిర్ రీస్టోరేషన్ చేయించుకోమని సలహా ఇవ్వొచ్చు కదా అని రాశారు. పాపం కేతన్ చెట్టుని పట్టుకుని బతికే ప్రయత్నం చేశాడు, కానీ ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఒక జెన్ జీ అమ్మాయి ఫ్యామిలీ ప్రెజర్‌లో ఎలా చిక్కుకుందో, పెళ్లి తొందర ఎందుకో అన్నది శోభా పాయింట్. చివరగా, కేతన్ ఇచ్చిన మనీ ట్రాన్సాక్షన్ గురించి కూడా ఆమె ప్రశ్నించారు.

ఈ ఆర్టికల్‌తో ఇంటర్నెట్ షేక్ అయ్యింది. రీడర్స్ ఆమె టోన్‌ని తీవ్రంగా తప్పుబట్టారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డి.పి. పాండే X (ట్విట్టర్) లో స్పందిస్తూ, ఇలాంటి ఎరోటిక్ రైటప్స్ అవసరమా అని ప్రశ్నించారు. దీపికా నారాయణ్ భరద్వాజ్ ఇంకో కోణం చూపిస్తూ.. ఒకవేళ మగ రైటర్ ఎవరైనా ఒక అమ్మాయి మరణాన్ని ఇలాగే హేళన చేస్తే, దేశం ఏమైపోయేది? అని నిలదీశారు. మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ షోనీ కపూర్ కూడా ఇలాగే ప్రశ్నిస్తూ.. అసలు ఫోకస్ బాధితుడిపై ఉండాలి కానీ, హెయిర్ ప్యాచ్ పైనో, నిందితుల పైనో కాదని మండిపడ్డారు. దాంతో డిబేట్ మారింది. ఇది మర్డర్ కేసు నుంచి లిస్టిక్ ఇంటిగ్రిటీ అనే కొత్త డిబేట్‌కి దారితీసింది.

శోభా డే ఆర్టికల్ మీద ఇంటర్నెట్ రచ్చ నడుస్తుండగానే, మరో స్టార్ రైటర్ చేతన్ భగత్ ఎంట్రీ ఇచ్చాడు. శోభా డేలా “హెయిర్ ప్యాచ్” గురించి చేతన్ మాట్లాడలేదు, ఆకర్షణ, రూపం గురించి అస్సలు టచ్ చేయలేదు. చేతన్ భగత్‌ అడిగిన ప్రశ్న ఒక్కటే.. సియాకి ఇష్టం లేకపోతే, పెళ్లికి సింపుల్‌గా ‘నో’ అని చెప్పలేదా అని. ఆర్టికల్ స్టార్టింగ్‌లోనే చేతన్ భగత్ ఒక క్లారిటీ ఇచ్చారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోందని, కోర్టులో తప్పు రుజువైతే శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ, సమాజం అడగాల్సిన అన్‌కంఫర్టబుల్ క్వశ్చన్స్ ఆగిపోకూడదన్నది చేతన్ భగత్‌ వాదన. ఈ కేసు కేవలం మర్డర్ మాత్రమే కాదు, మన సొసైటీలో ఉన్న ఒక పెద్ద సమస్యకు అద్దం పడుతోందని ఆయన పాయింట్.

చాలామంది యంగ్ అడల్ట్స్ తమ పేరెంట్స్ మాటకు ఎదురు చెప్పలేక ఎందుకు సతమతమవుతున్నారు? అఫ్లూయెంట్ కుటుంబాల్లో ఈ సమస్య ఇంకా ఘోరంగా ఉంటుంది. వాళ్లకు లగ్జరీ కార్లు, ఫారిన్ ట్రిప్స్, పెద్ద పెద్ద కాలేజీలు ఉండొచ్చు.. కానీ, ‘లైఫ్ పార్ట్నర్’ విషయంలో మాత్రం వాళ్లకు ఓన్ డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ ఉండదు. ఫైనాన్షియల్ డిపెండెన్సీ వల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని వారు కోల్పోతున్నారా? ఒకవేళ సియాకి పెళ్లి ఇష్టం లేకపోతే, ఫ్యామిలీ ప్రెజర్, బిజినెస్ ఇంట్రెస్ట్స్ వల్ల ఆమె ఆ బంధం నుంచి బయటకు రాలేకపోయిందా? అని చేతన్ భగత్ ప్రశ్నించారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి.. ఏ వాదనా మర్డర్‌ని సమర్థించదు, ఇది కేవలం పరిస్థితుల విశ్లేషణ మాత్రమే అని చేతన్ భగత్‌ పదే పదే చెప్పారు.

అయినప్పటికీ, చేతన్ భగత్‌ ఆర్టికల్ కూడా మంటలు పుట్టించింది. బర్ఖా త్రేహన్ స్పందిస్తూ… “ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండానే మోటివ్స్ గురించి ఎలా మాట్లాడుతారు? ఇది సోషల్ కామెంటరీ కాదు. ట్రయల్!” అని ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఇందులో ‘జెండర్ బయాస్’ ఉందని, ఒక మగవాడు క్రైమ్ చేస్తే అది నేరం, అదే ఒక ఆడది చేస్తే.. పేట్రియార్కి, సొసైటీ, పేరెంట్ ప్రెజర్ అని రీజన్స్ వెతకడం ఏంటి? అని నిలదీశారు. ఇక, అమిత్ కిల్హోర్ అనే యూజర్ అడిగిన ప్రశ్న బాగా వైరల్ అయ్యింది.. “పోలీసుల లెక్క ప్రకారం ఆ కోటి రూపాయల ట్రాన్సాక్షన్ సియా చేసింది, దానికి కూడా సొసైటీనో, పేరెంట్స్‌ ప్రెజర్ కారణం అంటారా?” అని అమిత్ ప్రశ్నిస్తున్నారు. అన్నీ సోషియాలజీ కోణంలో చూడాల్సిన అవసరం లేదని, కొన్ని కేవలం క్రిమినల్ కేసులేనని అమిత్ స్పష్టం చేశారు. అలాగే, గబ్బర్ సింగ్ అనే యూజర్ తనదైన శైలిలో స్పందిస్తూ.. “సియాకు పెళ్లి నుంచి బయటపడాలని ఉంటే, మరి కేతన్‌ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఎందుకు తీసుకుంది?” అని సూటిగా ప్రశ్నించారు.

ఇది శోభా డే వర్సెస్ చేతన్ భగత్ డిబేట్ కాదు, ఇది ఇప్పుడు జర్నలిజం ఎథిక్స్ గురించిన పెద్ద యుద్ధం. కోర్టు తీర్పు రాకముందే, ఒపీనియన్ రైటర్స్ ఇలా సైకాలజీ, ఫ్యామిలీ ప్రెజర్, సోషల్ కండిషనింగ్ గురించి రాయడం కరెక్టేనా? దీనివల్ల పబ్లిక్ మైండ్‌సెట్ మారిపోయి, కేసు దారి తప్పుతుందా? ఒక వర్గం ఏమంటుందంటే.. ఇది సొసైటీని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం అని! మరో వర్గం ఏమంటుందంటే.. ఇది నేరుగా బాధితుడిని అవమానించడం, నిందితుడిని వెనకేసుకొని రావడం అని! కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు ఇప్పుడు కేవలం ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు… ఇది మీడియా, జర్నలిజం, జెండర్ పాలిటిక్స్, అలాగే మన సమాజపు కపటత్వం మీద జరుగుతున్న ఒక ‘నేషనల్ డిబేట్’.

అయితే, ఈ విషయంలో మీ స్టాండ్ ఎటువైపో చెప్పేముందు, అడగాల్సిన చివరి ప్రశ్న ఒకటి ఉంది.. జర్నలిజం సరిహద్దును ఎక్కడితో పరిమితం చేయాలి? ఇక్కడే, ఒక్క నిమిషం ఆగండి. శోభా డేని మర్చిపోండి. చేతన్ భగత్ ని మర్చిపోండి. సోషల్ మీడియా రచ్చను పక్కన పెట్టండి. ఇప్పుడు అసలైన, అతి పెద్ద ప్రశ్న వేసుకుందాం. ఒక మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ నడుస్తుండగా.. ఒక జర్నలిస్ట్ లేదా ఒపీనియన్ రైటర్… నిందితుల మైండ్‌సెట్ గురించి, ఆ సోషల్ పరిస్థితులు గురించి రాయొచ్చా? అలా రాయడం వల్ల ఆ క్రైమ్‌ని “జస్టిఫై” చేస్తున్నట్టు అనిపించదా? ఇదే అసలైన డిబేట్.

మీరు శోభా డే, చేతన్ భగత్ ఆర్టికల్స్‌ని క్షుణ్ణంగా గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. వాళ్లిద్దరూ మర్డర్‌ని సమర్థించలేదు. చేతన్ భగత్ స్పష్టంగా “తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే” అని రాశారు. శోభా డే కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తోందని గుర్తుచేశారు. అయినా సరే, ఎందుకు ఇంత దుమారం? ఎందుకు ఇంత విమర్శ? ఎందుకంటే, చాలామంది పాఠకులకు ఒక మోటివ్‌ని వివరించడానికి… ఒక క్రైమ్‌ని సమర్థించడానికి మధ్య చాలా తేడా ఉందని అనిపించింది. ద లైన్ బిట్వీన్ అనాలిసిస్ అండ్ అడ్వకసీ.

శోభా డే ‘హెయిర్ ప్యాచ్’ గురించి, ఆకర్షణ గురించి రాసినప్పుడు.. అసలైన బాధితుడైన కేతన్ అగర్వాల్ కంటే, నిందితురాలి చుట్టూ ఫోకస్ మారిపోయిందని రీడర్స్ ఫీలయ్యారు. అలాగే, చేతన్ భగత్ ఫ్యామిలీ ప్రెజర్, ఫైనాన్షియల్ డిపెండెన్సీ గురించి రాసినప్పుడు.. అవి నిజమైన సోషల్ ఇష్యూస్ అయినప్పటికీ, కేసు నడుస్తుండగా వీటిని చర్చించడం వల్ల, క్రిమినల్ అకౌంటబిలిటీ నుంచి దృష్టి పక్కదారి పడుతుందని విమర్శకులు వాదించారు. దీనిపైనే ఎక్స్‌పర్ట్స్ అందరూ భిన్నమైన అభిప్రాయాలు వెల్లడించారు. డి.పి. పాండే ఏమంటున్నారనంటే.. కష్టాలు ఉంటే మర్డర్ చేయొచ్చా? ఇది మోరల్ రీజనింగ్ కాదన్నారు! దీపికా నారాయణ్ భరద్వాజ్ స్పందిస్తూ.. జెండర్ మారితే ఈ ఆర్టికల్స్ ఇలాగే ఉండేవా? ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని వేలెత్తిచూపారు. బర్ఖా త్రేహన్ విషయానికి వస్తే, ఇది ఇన్వెస్టిగేషన్ కాదు, మీడియా ట్రయల్ అని ఎద్దేవా చేశారు. గబ్బర్ సింగ్ ఏమంటున్నారంటే, కోటి రూపాయల లావాదేవీలు ఉన్నప్పుడు, దాన్ని కేవలం ఫ్యామిలీ ప్రెజర్‌గా ఎలా చూస్తారని అడుగుతున్నారు.

ఇక్కడ నిజానికి రెండు వాదనలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే.. జర్నలిజం అంటే కేవలం ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయడం మాత్రమే కాదు, ఆ ఫ్యాక్ట్స్ వెనుక ఉన్న “ఎందుకు?” అనే ప్రశ్నను కూడా వెతకడం. కానీ, ఇంకో వర్గం ఏమంటుందంటే.. ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నప్పుడు, కేసు కోర్టులో ఉన్నప్పుడు, అనవసరమైన అనాలసిస్‌లు పబ్లిక్ మైండ్‌సెట్‌ను మ్యానిప్యులేట్ చేస్తాయని! అదే కదా ఇక్కడ జరుగుతోంది. ఒకే పేరాగ్రాఫ్.. ఇద్దరు రీడర్స్.. రెండు భిన్నమైన అర్థాలు!

ఈ కేసు కేతన్ అగర్వాల్ మర్డర్ కేస్ మాత్రమే కాదు. ఇది జర్నలిజం బాధ్యత ఏంటి? ఎడిటోరియల్ ఎథిక్స్ ఏంటి? జెండర్ పాలిటిక్స్ ఎలా పనిచేస్తున్నాయి? సమాజం నేరాలను ఎలా చూస్తోంది? అనే విషయాలపై జరుగుతున్న యుద్ధం. కోర్టు తన పని తాను చేస్తుంది, పోలీస్ ఎవిడెన్స్ ఇస్తారు, జడ్జి తీర్పు ఇస్తారు. కానీ, అంతకంటే ముందే ప్రజల మనసుల్లో ఒక తీర్పు వచ్చేస్తుంది. ఈ రైటర్స్ ఎథికల్ లైన్ క్రాస్ చేశారా? లేక సమాజం భయపడే ఒక చేదు నిజాన్ని బయటపెట్టారా? ఈ గొడవ శోభా డే, చేతన్ భగత్ కంటే చాలా పెద్దది. ఇది “మాటలకు ఉండే భారత్ కు “, “జర్నలిస్ట్ కలిగి ఉండాల్సిన బాధ్యతకు” మధ్య జరుగుతున్న పోరాటం. మరి మీరేమంటారు? శోభాడే, చేతన్ భగత్‌ ఆర్టికల్స్ సమాజానికి కనువిప్పు కలిగించాయా… లేక, కేతన్ హత్య కేసులో అనవసరంగా లైన్ క్రాస్ చేశాయా?

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.