
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ తన లైనప్‌లో ఉన్న Samsung Galaxy M47 5Gను భారతదేశంలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ రేపు (జూన్ 29) భారత మార్కెట్లోకి రానుంది. Samsung Galaxy M47 5G ఫోన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, భారీ 6000mAh బ్యాటరీ ఉండనున్నాయి.
Samsung Galaxy M47 5G Launch Date
భారతదేశంలో Samsung Galaxy M47 5G విడుదల తేదీ ఖరారైంది. ఈ శాంసంగ్ ఫోన్ జూన్ 29న మార్కెట్లో లాంచ్ కానుంది. తాజాగా ఈ బ్రాండ్ ఫోన్‌లోని దాదాపు అన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించింది. Samsung Galaxy M47 5G రెండు కలర్‌లలో వస్తుందని కంపెనీ వెల్లడించింది. అందులో రోగ్ రెడ్, బ్లేజ్ బ్లూ కలర్‌లు ఉన్నాయి. కాగా ఈ ఫోన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. భారతదేశంలో దీని ధర సుమారు రూ.30,000 ఉండవచ్చని నిఫుణులు భావిస్తున్నారు.
Samsung Galaxy M47 5G Features
Samsung Galaxy M47 5Gలో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 4 రెట్లు స్క్రాచ్ రెసిస్టెన్స్ ఫీచర్ అందించారు. అలాగే 2 మీటర్ల ఫాల్ రెసిస్టెన్స్ కూడా అందుబాటులో ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ సేఫ్టీని కూడా కంపెనీ అందించింది. Samsung Galaxy M47 5G ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoCతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16తో పాటు, వన్ UI 8.5తో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో షూటర్ ఉంది. ముందు భాగంలో పంచ్-హోల్‌లో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. Samsung Galaxy M47 5G ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6000mAh బ్యాటరీ ఉంటుంది.









