
student protests : శనివారం రాత్రి నుంచి ప్రారంభమైన పంజాబ్లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన ఆదివారం ఉదయం మరింత తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లో నానా హంగామా సృష్టించారు. క్యాంపస్‌లో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన మిగ్-23యూఎమ్పైకి ఎక్కిన ఓ విద్యార్థి నిరసన తెలియజేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వదంతులు యూనివర్సిటీ వ్యాప్తంగా వ్యాపించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. దీంతో శనివారం అర్థరాత్రి నుంచి క్యాంపస్‌లో ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఆందోళనల్లో భాగంగా ఆదివారం ఉదయం విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. క్యాంపస్‌లో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన మిగ్-23యూఎమ్ విమానంపైకి ఎక్కి ఓ విద్యార్థి నిరసన తెలిపారు. మరో పదిమంది విద్యార్థులు మిలిటరీ ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళనకు దిగారు.
#WATCH | Jalandhar, Punjab: Students hold protest at Lovely Professional University (LPU)
Dr. Jaspal Singh Sandhu, Vice Chancellor of LPU, says, "The police registered an FIR based on the students’ allegations. All necessary support will be provided. Five students have been included in the SIT that will conduct the investigation. If the incident is found to be genuine, appropriate legal action will be taken. There were other demands as well, logistical demands, which our administration officials will sit down and discuss. I wasn’t even aware of this incident…"
— ANI (@ANI) September 27, 2026
పలువురు విద్యార్థులు క్యాంపస్‌లోని గదుల కిటికీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అక్కడక్కడ యూనివర్సిటీ భవనాలకు నిప్పుపెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అంతటితో ఆగని విద్యార్థులు సమీపంలో ఉన్న జలంధర్-ఫగ్వారా నేషనల్ హైవేను దిగ్బంధించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అసలేం జరిగిందంటే..
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని శనివారం రాత్రి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తును పుకార్లు చికారు చేశాయి. ఈ విషయం విద్యార్థులకు చేరడంతో అర్థరాత్రి విద్యార్థులు నిరసనకు దిగారు. సెప్టెంబర్ 24న యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న ఓ యువతిపై కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని వారు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. స్పందించిన పోలీసులు దీనిపై ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఇవన్నీ వదంతులని విద్యార్థుల ఆందోళనను కొట్టిపాడేసింది. అసత్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. పుకార్లను విశ్వసించొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులను కోరింది.









