Supreme Court Raises Big Question on Reservation
Supreme Court Raises Big Question on Reservation

Supreme Court : తెలంగాణ రాష్ట్రంలో లోకల్‌ రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత కొంతకాలంగా ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ మరోసారి స్పష్టతనిచ్చింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌ వర్తించాలంటే నాలుగేళ్ల రూల్ తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానిక రిజర్వేషన్ల నిబంధనలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈరోజు సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. నాలుగేళ్ల విద్యాభ్యాసం నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. కాగా తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌ వర్తించాలంటే నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అంకిత అనే యువతి వేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేయడం గమనార్హం.

Also Read : పసిడి ప్రియులకు ఊరట.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై నేడు ఎంత తగ్గిందంటే?

వాస్తవానికి ఈ నిబంధన ఏకపక్షంగా ఉందని వాదిస్తూ దాఖలైన కేసును జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఎంబీబీఎస్‌ అర్హత పరీక్ష రాయాలంటే దానికి ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో విద్యాభ్యాసం చేయాలని, అలా చేసిన విద్యార్థులకే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోను సుప్రీం కోర్టు ధర్మాసనం మరోసారి సమర్థించింది. దీంతో MBBS అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పినట్లయింది.

Also Read : ఫిబ్రవరిలో మేడారం మినీ జాతర… తేదీలను ప్రకటించిన పూజారులు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.