UGREEN 100W Charger
UGREEN 100W Charger

ప్రముఖ చైనా కన్స్యూమర్ ఎలక్ట్రిక్ కంపెనీ యుగ్రీన్ (UGREEN) తన కొత్త అల్ట్రా స్లిమ్ ఛార్జర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 100W అవుట్‌పుట్‌తో వస్తుంది. ఇతర ఛార్జర్‌ల కంటే ఇది మరింత యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనికి Ugreen 100W Mini Ice GaN ఛార్జర్ అని పేరు పెట్టారు. ఈ ఛార్జర్‌లో మూడు పోర్ట్‌లు ఉన్నాయి. అందులో రెండు USB-C పోర్ట్‌లు, ఒక USB-A పోర్ట్ ఉన్నాయి. రెండు USB-C పోర్ట్‌లు 100W పవర్‌ను అందిస్తాయి. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Ugreen 100W Mini Ice GaN Charger Price

యుగ్రీన్ 100W మినీ ఐస్ గాన్ (Ugreen 100W Mini Ice GaN) ఛార్జర్ ధర సుమారు రూ. 2,500గా కంపెనీ నిర్ణయించింది. ఇది చైనాలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Ugreen 100W Mini Ice GaN Charger Specifications

యుగ్రీన్ సంస్థ లాంచ్ చేసిన ఈ 100W మినీ ఐస్ గాన్ ఛార్జర్ ఒక క్రెడిట్ కార్డు సైజులో.. సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 178 గ్రాముల బరువుతో వస్తుంది. దీనిని ప్యాంట్ జేబులో లేదా ల్యాప్ టాప్ బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లిపోవచ్చు. ఇందులో ఉండే రెండు USB-C పోర్ట్‌ల ద్వారా హెవీ ల్యాప్‌టాప్‌లను కూడా చాలా ఈజీగా ఛార్జ్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఇది 2022 మోడల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌ను 30 నిమిషాల్లోనే 53% వరకు ఛార్జ్ చేస్తుంది.

అలాగే USB-A పోర్ట్ స్మార్ట్‌వాచ్, ఇయర్ బడ్స్, కెమెరా వంటి చిన్న చిన్న డివైజ్‌లను ఛార్జ్ చేస్తుంది. ఇందులో ఛార్జింగ్ సమయంలో టెంపరేచర్ పెరగకుండా థర్మల్ మానిటరింగ్ సిస్టమ్‌ను అందించారు. దీనివల్ల డివైజ్ హీట్ ఎక్కకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు షార్ట్ సర్క్యూట్, ఓవర్‌లోడ్, ఓవర్ కరెంట్ వంటి ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.