-RAVI PRAKASH

E20 Petrol : ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీస్.. E20 పెట్రోల్ గురించి అసలు నిజాన్ని దాస్తున్నాయా? ప్రభుత్వం నుంచి ప్రెషర్ రావడంతో, దేశంలోని టాప్ కార్ & బైక్ మాన్యుఫ్యాక్చరర్స్ తమ స్టాండ్ మార్చుకున్నారా? కార్లు, బైక్‌లు కొన్నప్పుడు ఇచ్చే ఓనర్స్ మ్యాన్యువల్ బుక్‌లెట్‌లో కంపెనీలు అప్పట్లో రాసిన విషయాలకి.. ఇప్పుడు చెప్తున్న మాటలకి అస్సలు పొంతన లేదా? పూర్తిగా ప్లేట్ ఫిరాయించారా? ఢిల్లీ EX CM అరవింద్ కేజ్రీవాల్ రాసిన ఒక్క లేఖ.. మొత్తం ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీనే డిఫెన్స్‌లో పడేసిందా? గడిచిన కొన్ని రోజులుగా.. ఇండియాలో E20 పెట్రోల్ కాంట్రవర్సీ మామూలుగా పేలలేదు.

“E20 పెట్రోల్ వాడటం స్టార్ట్ చేశాక మా కార్లు, బైక్‌లు, స్కూటర్లలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి” అంటూ.. వేలాది మంది వెహికల్ ఓనర్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. కానీ, గవర్నమెంట్ మాత్రం E20 పెట్రోల్ 100% సేఫ్ అని గట్టిగా వాదిస్తోంది. దీనికి తోడు, గవర్నమెంట్ పెట్టిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో.. టాప్ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ముందడుగు వేసి పబ్లిక్‌కి ఒక క్లారిటీ ఇచ్చాయి. 2023 కంటే ముందు తయారైన వెహికల్స్‌లో కూడా.. E20 పెట్రోల్‌ను ఎలాంటి టెన్షన్ లేకుండా వాడొచ్చు అని పబ్లిక్‌గా హామీ ఇచ్చారు. వాళ్ల మాటల ప్రకారం.. ఈ పెట్రోల్ వల్ల మైలేజ్ కాస్త తగ్గొచ్చేమో కానీ, ఇంజన్ పాడవడం లాంటి మెకానికల్ డ్యామేజెస్ అయితే అస్సలు జరగవు. కానీ ఇప్పుడు, సీన్ రివర్స్ అయింది. ఒక కొత్త పొలిటికల్ తుఫాన్ స్టార్ట్ అయింది.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఏకంగా 29 ఆటోమొబైల్ కంపెనీలకు లెటర్లు రాశారు. అందులో వాళ్లకు MIND BLOCK అయ్యే కొన్ని గట్టి క్వశ్చన్స్ వేశారు. నిజానికి ఇవి కేజ్రీవాల్ అడుగుతున్న ప్రశ్నలు మాత్రమే కాదు.. ప్రస్తుతం ఇండియాలో ఉన్న లక్షలాది వెహికల్ ఓనర్స్ మనసులో ఉన్న డౌట్స్ కూడా ఇవే!. ఈ కంపెనీలన్నింటి నుంచి కేజ్రీవాల్ ఆన్సర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన అడుగుతున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే.. ఈ కంపెనీలు వాళ్లు ఇచ్చిన ఓనర్స్ మ్యాన్యువల్స్‌కు రివర్స్‌లో మాట్లాడుతున్నాయా? గవర్నమెంట్ ఎంటర్ అయి ప్రెషర్ పెంచిన తర్వాతే వీళ్లు తమ స్టాండ్ మార్చుకున్నారా? ఒకవేళ ఈ E20 ఫ్యూయల్ పాత బండ్లకు కూడా వంద శాతం సేఫ్ అయితే.. ఆ విషయాన్ని ఇప్పుడు అఫీషియల్‌గా పేపర్ మీద రాసివ్వగలరా? ఈ లెటర్స్ అయితే మేజర్ ఆటోమొబైల్ కంపెనీలన్నింటికీ వెళ్లాయి. కానీ, ఇందులో ఒక మూడు కంపెనీలు మాత్రం గట్టిగా బుక్కయ్యాయి. అంటే అందరి ఫోకస్ ప్రస్తుతం ఆ 3 కంపెనీస్ మీదే ఉంది. అవే.. Toyota. Maruti Suzuki. And Hero MotoCorp.

Also Read : కరూర్ తొక్కిసలాటలో రాజకీయ కుట్ర.. సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు:

ఇవే కంపెనీల ప్రతినిధులు.. కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వ అధికారులతో కలిసి మీడియా ముందుకు వచ్చి, 2023కు ముందు తయారైన వాహనాల్లో కూడా.. E20 పెట్రోల్ వాడటం పూర్తిగా సురక్షితమే అని ప్రకటించారు. వాళ్లు చెప్పిన ఒకే ఒక్క హెచ్చరిక ఏంటంటే.. మైలేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది.. అంతే, దానికి మించి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ చెప్పేది ఒక్కటే.. ఆ కంపెనీలు చెప్పేది నిజమే అయితే, దాన్ని నోటిమాటగా కాకుండా, పేపర్ మీద రాసివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ కంపెనీలకు ఒక వారం గడువిస్తూ.. మూడు సింపుల్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరారు. ఫస్ట్ క్వశ్చన్.. 2023 కంటే ముందు వచ్చిన వెహికల్స్‌లో ఈ E20 పెట్రోల్‌ను సేఫ్‌గా వాడొచ్చా? సెకండ్ క్వశ్చన్.. దీని వల్ల వచ్చే ఒకే ఒక్క ప్రాబ్లం మైలేజ్ కొద్దిగా తగ్గడమేనా? అండ్ థర్డ్ క్వశ్చన్.. ఆ పాత వెహికల్స్‌కి E20 వల్ల ఎలాంటి డ్యామేజ్ జరగదని.. మీరు అఫీషియల్‌గా గ్యారెంటీ ఇవ్వగలరా? ఇప్పుడు వీటన్నింటికీ రిటన్ ఆన్సర్స్ రావాల్సి ఉంది.

అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు.. ఆయన టీమ్ డైరెక్ట్‌గా పబ్లిక్‌లోకి వెళ్తుందని! పాత Vehicles ఉన్న ఓనర్లను, మెకానిక్‌లను, గ్యారేజీలను, రిపేర్ వర్క్‌షాప్‌లను, వీళ్లందరినీ కలిసి, అసలు గ్రౌండ్ లెవెల్‌లో E20 పెట్రోల్ వాడుతున్న వాళ్ల రియల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటో.. డాక్యుమెంట్ చేయబోతున్నారు. దీనర్థం ఏంటంటే.. ఈ కాంట్రవర్సీ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు.. ఇది కాస్తా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు బాల్ క్లియర్ గా ఇండియాస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోర్టులోనే ఉంది. ఎందుకంటే, గవర్నమెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ కంపెనీలు ఏదైతే చెప్పాయో.. దానికి కట్టుబడి, అదే అస్యూరెన్స్‌ను రాతపూర్వకంగా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాయా? ఇదే ఇప్పుడున్న బిగ్గెస్ట్ క్వశ్చన్. మరోవైపు.. ఇండియా వైడ్ గా.. 2023 కంటే ముందు మోడల్స్ ఉన్న చాలా మంది వెహికల్ ఓనర్స్, ఈ E20 పెట్రోల్‌కి మారాక రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని కంప్లైంట్ చేస్తున్నారు. దీంతో పాటు ఇంకో మేజర్ కంప్లైంట్ కూడా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఈ ఏప్రిల్ నుంచి చాలా పెట్రోల్ బంకుల్లో.. తక్కువ ఎథనాల్ ఉండే E5 లేదా E10 బ్లెండ్స్ దొరకడం లేదని యజమానులు చెబుతున్నారు. దీనివల్ల పాత వెహికల్స్ ఉన్న మిలియన్ల కొద్దీ ఓనర్లకు.. మరో ఆప్షనే లేకుండా పోయింది. మీ Vehicle 2018 మోడల్ అయినా, 2019 అయినా, 2020 అయినా, 2021 అయినా, లేదా 2022 మోడల్ అయినా సరే, వేరే దారి లేక, కచ్చితంగా E20 కొట్టించాల్సి వస్తోందని చాలా మంది ఓనర్స్ ఆవేదన చెందుతున్నారు.

దేశవ్యాప్తంగా.. మెకానిక్స్, గ్యారేజీలు, రిపేర్ వర్క్‌షాప్‌లు, అండ్ ఆటోమొబైల్ టెక్నీషియన్లకు.. కస్టమర్ల నుంచి ఇలాంటి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా అంతా ఇలాంటి వీడియోలతో నిండిపోయింది. కానీ గవర్నమెంట్ మాత్రం ఈ క్లెయిమ్స్‌ను కొట్టిపారేసింది. పైగా, లీడింగ్ ఆటోమొబైల్ కంపెనీలను పిలిపించి కన్స్యూమర్స్‌కి భరోసా ఇవ్వాలని కోరింది. జస్ట్ కొన్ని రోజుల క్రితమే.. పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు ఒక మాట చెప్పారు. “ఏ వెహికల్‌లో అయినా E20 వాడొచ్చు. దీనివల్ల కనిపించే ఏకైక ఇంపాక్ట్.. మైలేజ్ కొద్దిగా తగ్గడం మాత్రమే అని!” కానీ ఆ కంపెనీలు ఇప్పుడు ఇదే మాటను అఫీషియల్‌గా రాసివ్వగలవా? అదే ఇప్పుడు చూడాల్సింది. ఇక ఈ కాంట్రవర్సీ ఇంత పెద్దది అవ్వడానికి మెయిన్ రీజన్.. టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ లాంటి కంపెనీల.. పాత వెహికల్ యూజర్ మాన్యువల్స్‌ను కేజ్రీవాల్ పబ్లిక్‌గా ప్రస్తావించడం. ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఆ మాన్యువల్స్‌లో “10% కంటే ఎక్కువ ఎథనాల్ ఉన్న పెట్రోల్‌ను వాడితే ప్రమాదం” అని క్లియర్ గా రాసి ఉంది. అంటే, E10 దాటి దేన్నీ వాడకూడదని అర్థం.

అంతేకాదు, ఎక్కువ ఎథనాల్ ఉన్న బ్లెండ్స్ వాడితే.. ఇంజన్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుందని, కొన్ని వెహికల్ కాంపోనెంట్స్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ.. ఆ మాన్యువల్స్‌లోనే వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఆ మాన్యువల్స్‌లో అలాంటి వార్నింగ్స్ ఉంటే.. మరి ఈ రోజు కంపెనీలు దానికి భిన్నంగా ఎందుకు మాట్లాడుతున్నాయి? దీనికి ఏమైనా ఎక్స్‌ప్లనేషన్ ఉందా? లేక మధ్యలో ఏమైనా చేంజెస్ జరిగాయా? ఇప్పుడు ఈ మొత్తం వివాదంలో అసలు కాంట్రవర్సీ ఎక్కడ మొదలైందో చూద్దాం.. అరవింద్ కేజ్రీవాల్ ప్రకారం.. అసలు ట్విస్ట్ కంపెనీల ఓనర్స్ మ్యాన్యువల్స్ లోనే ఉంది. అప్పట్లో ఆ మ్యాన్యువల్స్‌లో రాసినదానికి, ఇప్పుడు ఈ కంపెనీలు చెబుతున్నదానికి.. అస్సలు సంబంధమే లేదని ఆయన వాదిస్తున్నారు. ముందుగా టయోటా గురించి చూద్దాం. కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టయోటా ఓనర్స్ మ్యాన్యువల్‌ను కోట్ చేస్తూ ఒక లైన్ చదివారు. ఆ మ్యాన్యువల్ ప్రకారం.. టయోటా వాహనాల్లో 10% వరకు ఎథనాల్ కలిపిన గ్యాసోలిన్ వాడొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే.. పెట్రోల్‌లో ఎథనాల్ శాతం 10% కంటే ఎక్కువ ఉండకూడదని ఆ మ్యాన్యువల్ సిఫార్సు చేస్తోంది. కానీ, ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదే మ్యాన్యువల్‌లో ఇంకొక ముఖ్యమైన నోట్ కూడా ఉంది. అదేంటంటే… ఒకవేళ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడుతున్నప్పుడు.. మీ వాహనం డ్రైవిబిలిటీ లేదా మైలేజ్ సరిగ్గా లేదనిపిస్తే.. వెంటనే ఆల్కహాల్ లేని సాధారణ అన్‌లెడెడ్ పెట్రోల్‌కు తిరిగి మారండి.

Also Read : నోవో నార్డిస్క్ విప్లవాత్మక అడుగు.. ఇక మనదేశంలోనూ వారానికి ఒక్కసారే ఇన్సులిన్…

దీన్ని బట్టి కేజ్రీవాల్ రెండు విషయాలను హైలైట్ చేస్తున్నారు. టయోటా కేవలం 10% వరకే ఎథనాల్‌ను రికమండ్ చేస్తోంది. ఆ 10% లోపు వాడినా కూడా… ఒకవేళ డ్రైవింగ్‌లో తేడా వచ్చినా, మైలేజ్ పడిపోయినా.. వెంటనే నార్మల్ పెట్రోల్‌కు షిఫ్ట్ అయిపోమని కంపెనీయే స్వయంగా సలహా ఇస్తోంది. మరి ఇప్పుడేమైంది? మొన్నటికి మొన్న ప్రభుత్వ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టయోటా ప్రతినిధులు వచ్చి ఏం చెప్పారు? పాత వాహనాల్లో కూడా E20 పెట్రోల్‌ను నిరభ్యంతరంగా, సేఫ్‌గా వాడుకోవచ్చని పబ్లిక్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. సరిగ్గా ఇక్కడే కేజ్రీవాల్ పెద్ద లూప్‌హోల్‌ను పట్టుకున్నారు. నిన్న మ్యాన్యువల్‌లో అలా రాసి… ఈరోజు ప్రెస్‌మీట్‌లో ఇలా ఎలా చెబుతారు? ఇది ముమ్మాటికీ Contradiction కదా? నెక్స్ట్.. మారుతి సుజూకీ వంతు. కేజ్రీవాల్ ప్రకారం.. మారుతి ఓనర్స్ మ్యాన్యువల్‌లోనూ సరిగ్గా ఇలాంటి రికమండేషనే ఉంది. పెట్రోల్‌లో ఎథనాల్ శాతం 10 శాతానికి మించకపోతేనే.. ఆ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ను వాడాలని మారుతి మ్యాన్యువల్ స్పష్టంగా చెబుతోంది.

అంతేకాదు, టయోటా లాగే వీళ్లు కూడా ఒక హెచ్చరిక ఇచ్చారు. ఎథనాల్ ఇంధనం వల్ల డ్రైవింగ్ స్మూత్‌నెస్ తగ్గినా, మైలేజ్ మారినా.. ఆల్కహాల్ లేని ప్యూర్ పెట్రోల్‌కు మారిపోవాలని. మరోసారి… కేజ్రీవాల్ వాదన ఏంటంటే… ఓనర్స్ మాన్యువల్ ఒకటి చెబుతోంది. ఇప్పుడు కంపెనీ, ప్రజలకు మరోటి చెబుతోంది. అందుకే కంపెనీలు తమ స్టాండ్‌ను మార్చుకున్నాయని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, కేజ్రీవాల్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక అడుగు ముందుకు వేశారు. మారుతి సుజూకీ, టయోటా కిర్లోస్కర్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు.. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి.. ఇలాంటి తప్పుదోవ పట్టించే పబ్లిక్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాయంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే, కంపెనీలు ఈ ఆరోపణలను అంగీకరించలేదు. అదే టైమ్‌లో.. ఈ డిబేట్ పొలిటికల్ స్పీచ్‌ల పరిధి దాటేసి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. వందలాది మంది యూజర్లు తమ పాత వాహనాల ఓనర్స్ మ్యాన్యువల్స్ ఫోటోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ మ్యాన్యువల్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మ్యాన్యువల్స్‌లోని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూస్తే… ఈ బైకులు కేవలం E10 లేదా అంతకంటే తక్కువ ఎథనాల్ ఇంధనానికి మాత్రమే… డిజైన్ చేశారని క్లియర్‌గా రాసి ఉంది. అంటే E20 కి పనికి రాదని! అంతేకాదు, అప్రూవ్ చేసిన లిమిట్ కంటే ఎక్కువ ఎథనాల్ ఉన్న పెట్రోల్ వాడితే.. లాంగ్ టర్మ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా ఆ మ్యాన్యువల్స్ హెచ్చరిస్తున్నాయి.

అవేంటో తెలుసా? ఫ్యూయెల్ ట్యాంక్ లోపల ఉండే కోటింగ్ డ్యామేజ్ అవ్వడం, రబ్బర్ ఫ్యూయెల్ హోసెస్, ట్యూబ్‌లు పాడైపోవడం.. ఫ్యూయెల్ సిస్టమ్ లోపల తుప్పు పట్టే ఛాన్స్ ఉండటం.. బండి నడిపేటప్పుడు పర్ఫార్మెన్స్, డ్రైవబిలిటీ తగ్గిపోవడం.. ఓవరాల్‌గా వెహికల్ పర్ఫార్మెన్స్ పూర్తిగా పడిపోవడం! ఇలా పెట్రోల్ సిస్టమ్‌లో ఉండే మెటల్, రబ్బర్, ప్లాస్టిక్ పార్ట్స్‌పైన.. ఎథనాల్ ప్రభావం పడుతుందని పాత మ్యాన్యువల్స్ నెత్తీ నోరూ బాదుకుని చెప్పాయి. ఇప్పుడు ఆ ఇమేజ్ లే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వివాదాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఎందుకంటే.. 2023 కంటే ముందు వచ్చిన దాదాపు అన్ని మ్యాన్యువల్స్‌లోనూ ఇలాంటి హెచ్చరికలే ఉంటే.. ఇప్పుడు జనం అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ ఏంటంటే.. “అసలు ఏం మారింది?” వెహికల్ టెక్నాలజీ ఏమైనా మారిందా? టెస్టింగ్ స్టాండర్డ్స్ మార్చారా? లేకపోతే కొత్త రీసెర్చ్‌ ఆధారంగా కంపెనీలు మాట మార్చాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఆయా Manufacturing కంపెనీలే. అందుకే అరవింద్ కేజ్రీవాల్.. దేశంలోని మొత్తం 29 ఆటోమొబైల్ తయారీ కంపెనీల నుంచి.. Written Clarification డిమాండ్ చేస్తున్నారు. పాత మ్యాన్యువల్స్ అంతలా హెచ్చరించినప్పుడు.. ఇప్పుడు సడన్‌గా అదే పాత వెహికల్స్‌కి.. E20 సేఫ్ అని ఎలా గ్యారెంటీ ఇస్తున్నారో కంపెనీలు సమాధానం చెప్పాలంటున్నారు.

దీంతో పాటు కేజ్రీవాల్ ఇంకో సీరియస్ ఆరోపణ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ దేశంలోని 6 పెద్ద ఆటోమొబైల్ కంపెనీలను పిలిపించి.. E20 పెట్రోల్ పూర్తిగా సేఫ్ అని కస్టమర్లకు పబ్లిక్‌గా భరోసా ఇవ్వాలని కోరిందట. కేజ్రీవాల్ చెప్పిన ఆ 6 కంపెనీలు.. Maruti Suzuki, Toyota Kirloskar, Hero MotoCorp, హ్యున్‌డే, Bajaj Auto, TVS Motor Company. అయితే, గవర్నమెంట్ చెప్పిన ఈ ప్రతిపాదనకు అన్ని కంపెనీలు ఒప్పుకోలేదని, కొన్ని కంపెనీలు ఇలాంటి పబ్లిక్ అస్యూరెన్స్ ఇవ్వడానికి నో చెప్పాయని.. కేజ్రీవాల్ క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఆరోపణల్లో ఎంత నిజముంది, ఎంత అబద్ధముంది అనేది.. ఆయా కంపెనీలు క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం.. ఇది ఇప్పుడు కేవలం ఇంధనానికి సంబంధించిన డిబేట్ కాదు. ఇది ట్రాన్స్‌పరెన్సీ, కార్పొరేట్ ANSWERABILITY, పబ్లిక్ ట్రస్ట్ కి సంబంధించిన పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఎందుకంటే కోట్ల మంది వెహికల్ ఓనర్స్ అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ ఒక్కటే.. E20 అంత సేఫ్ అయినప్పుడు… మరి మా పాత ఓనర్స్ మ్యాన్యువల్స్ ఎందుకు అంత భయపెట్టేలా రాశాయని అడుగుతున్నారు. దీనిపై ప్రభుత్వం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్తున్న డిఫెన్స్ ఏంటి? అసలు PANIC అవ్వాల్సిన అవసరం లేదని! వాళ్లు ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా వాదిస్తున్నారు?

ఇప్పటివరకు మనం ఈ స్టోరీలో ఒకవైపు వాదన మాత్రమే విన్నాం. ఇప్పుడు… భారత ప్రభుత్వం, ఆటోమొబైల్ కంపెనీలు ఏమంటున్నాయో చూద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారో వింటే… మీరు అసలు PANIC అవ్వాల్సిన అవసరమే లేదు. జూలై 4న జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో.. Maruti Suzuki, Toyota, హ్యున్‌డే, Hero MotoCorp, TVS, Bajaj లాంటి పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులంతా.. గవర్నమెంట్ ఆఫీసర్లతో కలిసి స్టేజ్ షేర్ చేసుకున్నారు. అందరూ కలిసి గట్టిగా, ఒకే మాట చెప్పారు. E20 పెట్రోల్ పక్కా సేఫ్. కొత్తగా తయారైన E20 కంపాటిబుల్ వాహనాలకే కాదు.. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత E10 వాహనాలకు కూడా.. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. టయోటా ప్రతినిధి విక్రమ్ గులాటి ఏమన్నారంటే.. ఈ E20ని మార్కెట్లోకి తెచ్చే ముందు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం… పాత బండ్ల మీద కూడా అన్ని రకాల టెస్టులు కంప్లీట్ చేశారట. ఇక మారుతి సుజూకీ అయితే ఒక బిగ్గెస్ట్ రియల్ వరల్డ్ డేటాను బయటపెట్టింది. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ భారతి ప్రకారం… గతేడాది 2 కోట్ల 80 లక్షల కార్లకు సర్వీసింగ్ చేశారు. అందులో కోటిన్నరకు పైగా కార్లు మూడేళ్ల కంటే పాతవి. అంటే ఇవన్నీ 2023 కంటే ముందు, E20 రాకముందు కొన్నవే. ఇంత పెద్ద డేటాని చెక్ చేసినా… E20 పెట్రోల్ వల్ల ఇంజన్ పార్ట్స్ పాడైపోయినట్టు గానీ, తుప్పు పట్టినట్టు గానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదంటున్నారు.

మారుతి కంపెనీ ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పింది. ఇప్పటికే ఉన్న పెట్రోల్ వాహనాలకు E20 వాడాలంటే… ఎలాంటి రెట్రోఫిట్ అవసరం లేదని స్పష్టం చేసింది. Now… Let’s pause here. ఎందుకంటే.. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు. అసలు రీట్రోఫిట్ అంటే ఏంటి? అని.. Suppose.. మీ బండి E10 పెట్రోల్ కోసం డిజైన్ చేశారని అనుకుందాం.. దాన్ని E20 ఇంధనానికి తట్టుకునేలా మార్చాలంటే.. కంపెనీలు కొన్ని ఎథనాల్-రెసిస్టెంట్ పార్ట్స్‌ను మారుస్తాయి. రబ్బర్ సీల్స్, ఫ్యూయల్ హోసెస్, గాస్కెట్స్, ప్లాస్టిక్ లేదా మెటల్ కాంపోనెంట్స్.. వీటిని రీప్లేస్ చేయడాన్నే రెట్రోఫిట్టింగ్ అంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… 2025లో వచ్చిన కొన్ని వార్తల ప్రకారం… 10-15 ఏళ్ల పాత Vehicles కోసం… మారుతి సుజూకీ ఒక ప్రత్యేకమైన “E20 అప్‌గ్రేడ్ కిట్” తయారు చేస్తోందని టాక్ నడిచింది. ఆ కిట్‌లో… ఎథనాల్ రెసిస్టెంట్ రబ్బర్ సీల్స్, ఫ్యూయల్ హోసెస్, గాస్కెట్స్, ప్లాస్టిక్ భాగాలు వంటి వాటిని మార్చే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ… ఇప్పుడు కంపెనీ చెబుతున్న మాట మాత్రం వేరే. ఎలాంటి రెట్రోఫిట్ అవసరం లేదని మారుతి స్పష్టంగా చెబుతోంది.

హీరో మోటోకార్ప్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. టూ-వీలర్లలో E20 వల్ల డ్యామేజ్ అయినట్లు.. తమ సర్వీస్ రికార్డుల్లో ఎక్కడా లేదంటున్నారు. అంటే… ఆటోమొబైల్ కంపెనీల స్టాండ్ చాలా క్లియర్‌గా ఉంది. మీ వాహనం 10 ఏళ్ల పాతదైనా… 8 ఏళ్ల పాతదైనా… లేదా E10 కోసం తయారైనదైనా… E20 వల్ల భయపడాల్సిన అవసరం లేదని ఈ కంపెనీలు చెబుతున్నాయి. కానీ… ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లాంటి పెద్ద పేపర్లలో వచ్చిన కొన్ని లీకుల ప్రకారం… Automotive Research Association of India చేసిన ఒక అన్‌పబ్లిష్డ్ స్టడీలో.. ఒక చిన్న డౌట్ రేజ్ అయింది. అదేంటంటే… E20 పెట్రోల్‌ని లాంగ్ రన్ లో వాడడం వల్ల, ఇంజన్ బ్లాక్ కి ఏం కాదు గానీ… ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉండే చిన్న చిన్న రబ్బర్ కాంపోనెంట్స్, పైపులు కొంచెం త్వరగా అరిగిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే వాటి లైఫ్ టైమ్ తగ్గి, నార్మల్ టైమ్‌ కంటే ముందే మార్చాల్సి రావచ్చు. అయితే, ఇవి కేవలం మీడియా రిపోర్ట్స్ మాత్రమే, అఫీషియల్ రిపోర్ట్ కాదు. కథ E20 దగ్గరే ఆగలేదు.. మన దేశ ఎథనాల్ రోడ్‌మ్యాప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తోంది. ఆల్రెడీ E22, E25, E27 & E30 ఫ్యూయల్స్ కి సంబంధించిన స్టాండర్డ్స్ కూడా రెడీ అయిపోయాయి.

Bureau of Indian Standards వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. At the same time.. E25పై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించే బాధ్యతను… ప్రభుత్వం ARAIకు అప్పగించింది. ఇందుకోసం E10, E20 Vehicles ను… ఏకంగా 1,50,000 కిలోమీటర్ల దూరం నడిపించి టెస్ట్ చేస్తున్నారు. మైలేజ్ ఎంత వస్తోంది? ఇంజన్ కండిషన్ ఏంటి? పార్ట్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ 2027 చివరికల్లా వస్తుంది. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ’ దీన్ని రివ్యూ చేస్తుంది. అప్పుడే పెట్రోలియం మంత్రిత్వ శాఖ కమర్షియల్ రోలౌట్‌పై ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే E25, E30 లపై ఎలాంటి అఫీషియల్ నిర్ణయం లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్… ఇండియా ఎథనాల్ బాటలో స్పీడ్‌గా దూసుకుపోతోంది. ఇప్పుడు మన ముందున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే… E20 కే ఇంత డిబేట్ నడుస్తుంటే… రేపు పొద్దున E25, E30 లు వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు వస్తోంది అసలైన ప్రశ్న! E20 సేఫ్ అని.. ప్రభుత్వం, ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి.

మరి అంతా సేఫ్ అయినప్పుడు… గవర్నమెంట్ ఇప్పుడే E25, E27, చివరకు E30 పెట్రోల్ కోసం ఎందుకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది? అఫీషియల్‌గా చూస్తే… దేశవ్యాప్తంగా ఈ హై-ఎథనాల్ బ్లెండ్స్ తీసుకురావడానికి… ఇంకా ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని ప్రభుత్వం అంటోంది. కానీ… లోపల జరుగుతున్నదేంటి? ప్రిపరేషన్స్ ఆల్రెడీ మొదలైపోయాయి, టెస్టింగ్ నడుస్తోంది, స్టాండర్డ్స్ కూడా నోటిఫై చేసేశారు.. సో కామన్‌గానే, వెహికల్ ఓనర్స్‌ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అసలు నిర్ణయమే తీసుకోనప్పుడు… ఈ రేంజ్‌లో ప్రిపరేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఫస్ట్ E20, నెక్స్ట్ E25, ఆ తర్వాత E30.. అసలు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? అన్నిటికంటే పెద్ద ప్రశ్న… ఈ మొత్తం వ్యవహారంలో.. కన్జ్యూమర్ ఎక్కడున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. బండి మీది. పైసలు మీవి. కానీ.. మీకు నచ్చిన ఫ్యూయల్ ఎంచుకునే ఫ్రీడమ్ మీకు ఉందా? ఒకవేళ మీ వెహికల్ E20కి సపోర్ట్ చేయకపోతే.. మీరు పెట్రోల్ బంక్‌కి వెళ్లి ధైర్యంగా E10 లేదా E5 పెట్రోల్ కొట్టించగలరా? భారతదేశంలో ఉన్న కోట్ల మంది వాహనదారులకు… ఈరోజు వినిపిస్తున్న సమాధానం ‘లేదు’ అని.

అమెరికా, జర్మనీ, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇప్పటికీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పాత బండ్లకు పాత పెట్రోల్, కొత్త బండ్లకు కొత్త పెట్రోల్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. కానీ… మన ఇండియాలో? ఆ ఛాయిస్ మెల్లమెల్లగా మాయమైపోతోంది! ఇప్పుడు ఇంకో షాకింగ్ మ్యాటర్ చూద్దాం. ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన… ఒక సీక్రెట్ టెక్నికల్ స్టడీ బయటపెట్టిన వివరాల ప్రకారం.. E20 ఫ్యూయల్‌తో మల్టిపుల్ ఇంజన్ టెస్టులు చేశారు. రిజల్ట్స్ చూస్తే… మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఒక BS4 ఇంజన్ అయితే టెస్టింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. కానీ… ఒక లీడింగ్ కంపెనీకి చెందిన BS6 టర్బోచార్జ్డ్ ఇంజన్… కేవలం 265 గంటల టెస్టింగ్ తర్వాతే ప్రాబ్లమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరో కంపెనీకి చెందిన ఇంజన్‌లో… 800 గంటల టెస్టింగ్ తర్వాత దాని ఎగ్జాస్ట్ వాల్వ్‌లో.. థర్మో-మెకానికల్ ఫెయిల్యూర్ కనిపించిందని కూడా వార్తలు వచ్చాయి. సింపుల్‌గా చెప్పాలంటే… కంటిన్యూస్‌గా హై టెంపరేచర్, ప్రెజర్ తగలడం వల్ల… ఇంజన్ లోపలి పార్ట్స్ తట్టుకోలేకపోతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే… అందరి రిజల్ట్స్ ఒకేలా లేవు. కొన్ని Vehicles వందల గంటలు తిరిగినా బానే ఉన్నాయి. కొన్ని మాత్రం మధ్యలోనే చేతులెత్తేస్తున్నాయి.

టూ-వీలర్స్ మాత్రం పర్లేదు, గట్టిగానే తట్టుకున్నాయి. ఇక మైలేజ్ విషయానికి వస్తే… అటు ఎక్స్‌పర్ట్స్, ఇటు గవర్నమెంట్, ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఒప్పుకున్న నిజం ఏంటంటే.. E20 పెట్రోల్ వాడటం వల్ల… బండి మైలేజ్ 2 శాతం నుండి 6 శాతం వరకు పడిపోతుంది. కొంతమందికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు.. కానీ… ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తెలుసు మైలేజ్ వాల్యూ ఏంటో..! ఇది చిన్న విషయం కాదు. నెలవారీ బడ్జెట్‌ని దెబ్బతీసే అంశం. ఇక్కడ ఇంకో పెద్ద డేంజర్ ఉంది. అదే ఫ్యూయల్ సిస్టమ్ లాంగ్ టర్మ్ లైఫ్.! ఎథనాల్ మామూలు పెట్రోల్ లాంటిది కాదు. దీనిలో ఆక్సిజన్ ఎక్కువ… moistureను లాగేసుకుంటుంది. దీనివల్ల పాత వెహికల్స్‌లోని… ఫ్యూయల్ హోసెస్, రబ్బర్ సీల్స్, గాస్కెట్స్, ప్లాస్టిక్ పార్ట్స్.. త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి.

చాలామంది EXPERTS… E20 వాడిన వెంటనే ఇంజన్ పాడవుతుందని చెప్పడం లేదు. కానీ లాంగ్ రన్ లో రిపేర్లు వస్తాయని అంటున్నారు. ఇప్పుడు మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి.. ఇదే జరిగితే.. ఆ రిపేర్ బిల్ ఎవరు కడతారు? ప్రభుత్వమా? ఆయిల్ కంపెనీలా? Vehicles తయారు చేసిన కంపెనీలా? లేక… అల్టిమేట్‌గా మీరా? జెన్యూన్‌గా ఆలోచిస్తే… ఆ బిల్లు కట్టేది బండి ఓనరే.. చిన్న రబ్బర్ పార్ట్ మార్చాలన్నా వేలల్లో ఖర్చు అవుతుంది. ఒకవేళ మొత్తం ఫ్యూయల్ లైన్ మార్చాల్సి వస్తే… ఖర్చు ఇంకా పెరుగుతుంది. మరొకవైపు మైలేజ్ తగ్గితే… ప్రతి నెల పెట్రోల్ ఖర్చు కూడా పెరుగుతుంది. ఇప్పటికే పెట్రోల్ రేట్స్ ఎక్కువగా ఉన్న టైమ్‌లో.. ఇది చాలా ఫ్యామిలీస్‌కి ఆందోళన కలిగించే అంశం. కానీ.. E20కు మద్దతు ఇచ్చేవారు మాత్రం… ఎథనాల్ బ్లెండింగ్ వల్ల… భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం తగ్గుతుందని.. రైతులకు ఉపయోగం ఉంటుందని. దేశానికి ఇంధన భద్రత పెరుగుతుందని అంటున్నారు.

అయితే… విమర్శకులు మరో ప్రశ్న అడుగుతున్నారు. రిస్క్ అంతా కన్జ్యూమర్ భరిస్తున్నప్పుడు.. పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయా? లేదు. మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతున్నాయా? లేదు. పోనీ… బంక్స్ లో నచ్చిన ఫ్యూయల్ ఎంచుకునే స్వేచ్ఛ ఉందా? అదీ లేదు. ఇక్కడ మరో ప్రశ్న కూడా రేజ్ అవుతోంది. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం… ఎథనాల్ బ్లెండింగ్ వల్ల దేశానికి కలిగే లాభాల గురించి చెబుతోంది. ఆయిల్ కంపెనీలకూ ప్రయోజనం కనిపిస్తోంది. అయితే… సామాన్య వినియోగదారుడికి దక్కుతున్న లాభం ఏంటి? పెట్రోల్ ధర తగ్గిందా? మెయింటెనెన్స్ ఖర్చు తగ్గిందా? కనీసం పెట్రోల్ బంక్‌లో నచ్చిన ఫ్యూయెల్ ఎంపిక చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారా? ఇవి… ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న ప్రశ్నలు. ఇప్పుడు అందరి కళ్లూ ఆటోమొబైల్ కంపెనీల పైనే ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ లేఖలకు ఆ కంపెనీలు సమాధానం ఇస్తాయా? తమ మాట మీద నిలబడతాయా? చివరగా ఒక్కటే ప్రశ్న… ఒకవేళ పాత E10 బండిలో ఈ కొత్త E20 పెట్రోల్ పోసి, లాంగ్ రన్ లో ఇంజన్ పాడైపోతే… దానికి అల్టిమేట్‌గా బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేశంలోని కోట్ల మంది వాహనదారులు… ఈ ఒక్క సమాధానం కోసమే వెయిట్ చేస్తున్నారు!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.