china

China : ఇండియా సరిహద్దుల్లో చైనా మరోసారి పెద్ద కుట్రకు తెరలేపింది. టిబెట్ పరిధిలోని యార్లుంగ్ త్సాంగ్పో నది కింది భాగంలో ఒక భారీ హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ నిర్మాణ పనులను చైనా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఈ మెగా ప్రాజెక్ట్ మన భారత బోర్డర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ ఏజెన్సీలు రీసెంట్‌గా సాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఈ ఏరియాను పరిశీలించగా.. బోర్డర్ అవతల చైనా కడుతున్న ఇలాంటి నదీ ప్రాజెక్టుల వల్ల ఇండియాలోని కింది ప్రాంతాలపై లాంగ్ టర్మ్‌లో చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుందని తేలింది. అయినప్పటికీ, గత కొన్ని నెలలుగా చైనా ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ పనులను మరింత స్పీడప్ చేసింది.

అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల ఇండియాకు వచ్చే నష్టం ఏంటంటే.. టిబెట్‌లో పుట్టే ఈ యార్లుంగ్ త్సాంగ్పో నది, అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ఇండియాలోకి ఎంటర్ అయ్యాక సియాంగ్ నదిగా మారుతుంది. ఆ తర్వాత అసోంలో ఇదే బ్రహ్మపుత్ర నదిగా మారి ప్రవహిస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నది మన దేశంలోని లక్షలాది మంది భారతీయులకు మెయిన్ వాటర్ సోర్స్. చైనా చేస్తున్న ఈ పనిపై భారత ప్రభుత్వం అండ్ అధికారులు చాలా గట్టిగా నిఘా పెట్టారు. నది ఎగువ భాగంలో చైనా ఇంత పెద్ద డ్యామ్ కట్టడం వల్ల, నీటి సహజ ప్రవాహం దెబ్బతింటుందని అండ్ కింది ప్రాంతాలలో వరదల ప్యాటర్న్ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

చైనా మైండ్ గేమ్

దీని వెనుక చైనా పెద్ద మైండ్ గేమ్ కూడా దాగి ఉంది. రేపు పొద్దున భారత్, చైనా మధ్య ఏదైనా వివాదం లేదా యుద్ధం లాంటి పరిస్థితి వస్తే.. నది పైభాగంలో ఉన్న ఈ భారీ డ్యామ్ వల్ల చైనాకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే డ్యామ్ గేట్లు మూసేసి ఇండియాకు నీళ్లు రాకుండా చేయాలన్నా, లేదా ఒకేసారి నీటిని వదిలి కింది ప్రాంతాలను ముంచేయాలన్నా.. వాటర్ ఫ్లో కంట్రోల్ మొత్తం బీజింగ్ చేతుల్లోనే ఉంటుంది. గత ఏడాది పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇస్తూ.. ఈ మెగా డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన రిపోర్ట్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, దశాబ్దాలుగా చైనా వేస్తున్న ప్లాన్స్‌పై తాము నిఘా ఉంచామని చెప్పారు.

సరిహద్దు నదులకు సంబంధించిన అన్ని ఇష్యూస్‌ను 2006లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్ లెవెల్ కమిటీ ద్వారా చైనాతో చర్చిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాదు, జూలై 2025లో జరిగిన షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల మీటింగ్ కోసం మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా వెళ్ళినప్పుడు కూడా ఈ సీరియస్ మ్యాటర్‌ను చైనా ముందు ఉంచినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే తాము కేవలం కరెంట్ ఉత్పత్తి కోసమే ఈ హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ కడుతున్నామని, దీనివల్ల ఇండియాకు ఎలాంటి నష్టం జరగదని బీజింగ్ చెప్తున్నప్పటికీ.. డ్రాగన్ దేశాన్ని నమ్మలేం కాబట్టి న్యూఢిల్లీ ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని డిసైడ్ అయింది.

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.