IND vs SL  శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ ల భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన సంచలన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో పాటు, మొత్తంగా 4 భారీ సిక్సర్లతో విరుచుకుపడి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఆఖరి ఇన్నింగ్స్‌లో భారత్ ముందు 207 పరుగుల లక్ష్యం నిలిచింది. చివరి రోజైన మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆఖరి ఓవర్ ప్రారంభమయ్యే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. జయానికి ఇంకా 16 పరుగులు అవసరమైన సమయంలో, క్రీజులో సిరాజ్ చ ఆల్రౌండర్ సారాంశ జైన్ ఉన్నారు. ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కావడం వల్ల చాలామంది భారత టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కొన్ని బంతులు ఆడిన తర్వాత మిగతా వారికి అవకాశం ఇచ్చేందుకు రిటైర్డ్ అవుట్‌గా వెనుతిరిగారు.

ఈ దశలో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ నువాంత వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతిని సిరాజ్ డీప్ మిడ్-వికెట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని స్ట్రెయిట్ డౌన్ ద వికెట్ సిక్స్ కొట్టాడు. ఇక మూడో బంతికి కూడా అదే రేంజ్‌లో మరో భారీ సిక్స్ బాది హ్యాట్రిక్ సిక్సర్లతో జట్టును గెలిపించాడు. దీనికి ముందు ఓవర్లోనే బౌలర్ దినూషా బౌలింగ్‌లో సిరాజ్ తన తొలి సిక్సర్ బాదడం విశేషం.

సాధారణంగా వార్మప్ మ్యాచ్‌లలో కఠినమైన నియమాలు ఉండవు కాబట్టి, భారత్ విజయం సాధించినప్పటికీ ఇరు జట్లు ఆటను కొనసాగించాయి. ఆ తర్వాత బంతికి ఇన్‌సైడ్ ఎడ్జ్ ద్వారా ఫోర్, ఆపై ఒక సింగిల్ సాధించిన హైదరాబాద్ పేసర్ సిరాజ్ 15 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మెరిశాడు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.