Nizamabad : పరాయి పురుషుడి మోజులో పడి, కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణ శివార్లలో ప్రశాంత్, సంధ్య దంపతులు నివసిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా సంధ్యకు మరో వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా భర్తను శాశ్వతంగా వదిలించుకోవాలని సంధ్య ఒక పక్కా ప్లాన్ వేసింది.

Also Read : 70 ఏళ్ల GHMC యాక్ట్ రద్దు.. పెరగనున్న పన్నులు.. కొత్త ‘క్యూర్‌-2026’ చట్టంలో ఏముంది?.

ముందస్తు పథకం ప్రకారం భర్త ప్రశాంత్‌తో ఎక్కువగా మద్యం తాపించింది. అతడు పూర్తిగా మత్తులోకి జారుకోగానే, తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ప్రశాంత్‌పై విచక్షణారహితంగా దాడి చేసి, ఆ తర్వాత భవనం పైనుంచి కిందకు తోసేశారు. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి కానీ, అతడు చనిపోలేదు.

Also Read : కేటీఆర్‌ కన్నెపల్లి సందర్శనకు అడుగడుగున అడ్డంకులు… జాతీయ రహదారిపై హైడ్రామా

ఇంకా బతికే ఉన్నాడని

భవనం పైనుంచి పడేసినా భర్త ఇంకా బతికే ఉన్నాడని, శ్వాస తీసుకుంటున్నాడని సంధ్య గమనించింది. ఎలాగైనా అతడిని చంపాలనే కసితో, ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ హార్పిక్ లిక్విడ్‌ను ఒక సిరంజిలోకి తీసుకుంది. దాన్ని నేరుగా ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించింది. ఆ విషపూరితమైన కెమికల్ ఒంట్లోకి చేరడంతో ప్రశాంత్ కాసేపటికే నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు.

అయితే, ప్రశాంత్ చావుపై అతడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్య సంధ్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియుడి కోసం అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను ఇంత కిరాతకంగా చంపడం చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.