
Food safety raids :పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లు ఉంది హైదరాబాద్‌లోని పలు పేరున్న రెస్టారెంట్ల పరిస్థితి. నగరంలోని పలు హోటల్స్ వాడుతున్న నూనె, వినియోగిస్తున్న వస్తువులు, పాటిస్తున్న శుభ్రతను పరిశీలిస్తే ఇక జన్మలో హోటల్ జోలికి పోరంటే అబద్ధం కాదు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో న టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆహార కల్తీ, నాణ్యతపై దృష్టి సారించిన అధికారులు పలు రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం, ప్రీజ్లలో కుళ్లిపోయిన ఆహారం, మాంసం నిలువచేసి తిరిగివాటినే వేడి చేసి కస్టమర్లకు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ట్లు వెల్లడైంది. దీంతో నగరంలోని హోటళ్లు, పబ్‌లలో ఆహార భద్రతా నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్పష్టమైంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ మాదాపూర్ మొనాస్టరీ యాంఫి బ్రూవరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టగా వంటగదిలో ఏమాత్రం శుభ్రత లేకపోవడాన్ని ఆధికారులు గుర్తించారు. అలాగే ఆరోగ్యానికి హానికరమైన దాదాపు 5 కిలోల వినియోగించిన వంట నూనెను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఇవే కాదు పలు రెస్టారెంట్లలో రిఫ్రిజిరేటర్లను పరిశీలిస్తే ఇంకా దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ఫ్రీజర్‌లో రోజుల తరబడి నిల్వ చేసిన వండిన ఆహార పదార్థాలతో పాటు, గడువు ముగిసిన మాంసం కూడా ఉన్నట్లు తేలింది. ఎలాంటి లేబుల్స్, తయారీ తేదీలు లేని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో దాస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వంట తయారీ ప్రాంతంలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్లు, పగిలిన గుడ్లు, గడువు దాటిన పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది.
కాగా, గత రెండు రోజుల క్రితమే పలు ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేప్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్ల కిచెన్లలో అపరిశుభ్రవాతావరణం, డ్రైనేజీ, దోమలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించి ఆయా హోటల్స్‌కు నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా అపరిశుభ్రవాతావరణంలో ఆహార పదార్థాలు నిల్వ చేసిన పలు హోటల్స్ లైసెన్స్ ర్ధు చేశారు.
ఈ తనిఖీల్లో గచ్చిబౌలిలోని గర్ల్‌ఫ్రెండ్ మందీ, గోపనపల్లిలో శ్రీకృష్ణ ఫ్యామిలీ దాబా, పుప్పాలగూడలోని నెక్సార్ హోలిఫిష్ ఫుడ్స్, ఆస్పీ హాస్పిటాలిటీ, సీజన్స్ ఎక్స్‌ప్రెస్, సాయిమెస్, లక్కీ రెస్టారెంట్, గోదావరి ఘుమఘుమలు, యమ్మీబీ, ఆదిత్య రెస్టారెంట్, ఈట్ క్లబ్, జేఎంజే రెడ్డీస్ హాస్టల్, వెష్ణవి దర్శిని తదితర రెస్టారెట్లకు జరిమానా విధించగా ఈ రోజు మాదాపూర్‌లోని లక్కీ రెస్టారెంట్, ఇనార్బిట్ మాల్లోని పలు రెస్టారెంట్ల లైసెన్స్ రద్దు చేశారు. ప్రజులు ఇలాంటి శుభ్రత లేని పదార్థాలను తింటే అనారోగ్యం పాలవ్వడం గ్యారంటీ అని అధికారులు హెచ్చిరిస్తున్నారు.









