Transfer of DSPs in Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేస్తూ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల ద్వారా రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణకు, శాంతిభద్రతల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. బదిలీ అయిన అధికారులు అందరూ తక్షణమే తమకు కేటాయించిన కొత్త విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశించారు.

ఈ బదిలీల ప్రక్రియలో వివిధ కీలక విభాగాలకు ప్రాధాన్యత కల్పించారు. బదిలీ అయిన అధికారులకు సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, రోడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సీసీఆర్బీ వంటి కీలక విభాగాలతో పాటు వివిధ పోలీస్ కమిషనరేట్లు, జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. ముఖ్యంగా రామగుండం కమిషనరేట్‌తో పాటు సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, సైబరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు కీలక నియామకాలను చేపట్టారు.

రామగుండం కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఏసీపీలకు కీలక బాధ్యతలు అప్పగించారు. కంప రవీందర్ (ఏసీపీ, సీసీఎస్), బొలగాని శ్రీనివాసరావు (ఏసీపీ, టాస్క్ఫోర్స్), టి. ప్రవీణ్ కుమార్ (ఏసీపీ, సీసీఎస్) లు రామగుండంలో నియమితులయ్యారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పి. కరుణాకర్ రెడ్డి (ఏసీపీ, ఎస్పీ, హైదరాబాద్ సిటీ), జీ.గోవర్ధన గిరి (ఏసీపీ, ఎస్పీ, హైదరాబాద్ సిటీ), ఎస్.వెంకటేష్ (ఏసీపీ, క్రైమ్స్, సైబరాబాద్), కె. పురుషోత్తం (ఏసీపీ, ఎస్బీ, సైబరాబాద్), సర్ల రాజు (ఏసీపీ, సీసీఎస్ & డీడీ, హైదరాబాద్ సిటీ) బాధ్యతలు చేపట్టనున్నారు. కీత రామకృష్ణను ఏసీపీగా నియమిస్తూ, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి అటాచ్ చేశారు.

Also Read : బట్టగుండుతో 40 మంది మహిళలకు వల… నిత్య పెళ్లికొడుకు అరెస్టు!

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శాంతిభద్రతల విభాగాలతో పాటు ఫంక్షనల్ వర్టికల్స్‌లో కూడా పోస్టింగ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా ఎం. వెంకట నరసయ్య (ఆదిలాబాద్), కొద్ది భాస్కర్ (రాజన్న సిరిసిల్ల), బి.గురునాయుడు (నిజామాబాద్), భూపతి గట్టుమల్లు (కామారెడ్డి), తోటిచర్ల స్వామి (కరీంనగర్)లు ఆయా జిల్లాల్లో డీసీఆర్బీ/సీసీఆర్బీ ఫంక్షనల్ వర్టికల్స్ బాధ్యతలను స్వీకరించనున్నారు. సిరిసిల్ల ఎస్బీ డీఎస్పీగా జీ. వెంకటేశ్వర్లు, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీగా బి. బాలాజీ, ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా అడప నరసింహారావు, ఖమ్మం సీటీసీ ఏసీపీగా బి. హరినాథ్ బాబు నియమితులయ్యారు.

మరోవైపు నిజామాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో నియామకాలు పరిశీలిస్తే.. నిజామాబాద్ టాస్క్ఫోర్స్ ఏసీపీగా ఆర్. నరేందర్, సీసీఎస్ ఏసీపీగా పి. సృషిలం నియమితులు కాగా, సిద్దిపేట సీసీఎస్ ఏసీపీగా గడ్డం సదయ్య సదన్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. విద్యాసంస్థలు, శిక్షణ విభాగాల విషయానికొస్తే.. బాసర రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ డీఎస్పీగా ఎం. వెంకట రామయ్య, అంబర్‌పేట పీటీసీ డీఎస్పీగా ఎ.పెద్దన్న కుమార్ నియామకం పొందారు.

Also Read : ఖమ్మంలో రైతు అశీర్వాద సభ రద్దు…రేపు సాయంత్రం  రైతు భరోసా నిధుల పంపిణీ

శాఖాపరమైన విచారణలు, నిఘా విభాగాలైన ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏసీబీలలో కూడా అధికారులు నియమితులయ్యారు. బొబ్బాల ప్రవీణ్, ఎం. వెంకట్ రెడ్డి, ఆవుల రాజయ్యలు ఇంటెలిజెన్స్ డీఎస్పీలుగా బాధ్యతలు చేపట్టనుండగా.. పబ్బతి వెంకటేశ్వర్లు, చిలుక రాజిరెడ్డి, సంకెళ్ల వెంకటేష్‌లు సీఐడీ విభాగంలో నియమితులయ్యారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీలుగా జీ. మహేందర్ రెడ్డి, ఎం. రాజేష్ బాధ్యతలు తీసుకోనున్నారు.

మిగిలిన కీలక విభాగాల బదిలీల వివరాలు చూస్తే.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వీఅండ్‌ఈ) డీఎస్పీలుగా గొర్ల సీతారెడ్డి, నూనె వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. బూర శ్రీనివాస్ రోడ్ సేఫ్టీ (నార్త్ జోన్) డీఎస్పీగా, సి. విజయ్ రాజు చీఫ్ ఆఫీస్ డీఎస్పీ (PCS&S)గా, పాఠ రాజు టీజీ సీఎసీ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ భారీ బదిలీలతో క్షేత్రస్థాయిలో పోలీసు పర్యవేక్షణ మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read : సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తిరుగుబావుటా..బట్టబయలైన అంతర్గత అసంతృప్తి

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.