
తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరో అద్భుతమైన పథకాన్ని అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ (Indiramma Family Life Insurance) పథకానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకంతో పాటు మరికొన్నింటి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
ఈ నెల (నవంబర్) 19న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి. ఈ సందర్భంగా సిద్దిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. ఆ వేదిక నుంచే ఈ మహాత్కారక పథకం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ కింద కుటుంబంలో సంపాదనాపరుడైన వ్యక్తి ఏ విధంగా మరణించినా.. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ అందుతుంది.
ప్రభుత్వం దీని కోసం గ్రామాల్లో ప్రత్యేకంగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనుంది. కమిటీలోని సభ్యులు నవంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. ప్రజల నుంచి వివరాలు సేకరించి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను తహశీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులకు అందిస్తారు. వారు వాటిని వెరిఫై చేస్తారు.
ఈ పథకంతో పాటు ఇదే వేదికపై ప్రభుత్వం మరొక కానుకను ప్రజలకు అందించనుంది. రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ఉచిత చీరల పంపిణీ రెండో విడతను ప్రారంభించనుంది.
మరోవైపు ఇంకో రెండు రోజుల్లో జరగనున్న దీపావళి పండుగ సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి వేడుకను ఘనంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటి వరకు 2లక్షల 25 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తవగా.. ఆ ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొననున్నారు.
Also Read : అమెరికా ఎన్నికల్లో సరితా కోమటిరెడ్డికి ఓటమి.. ట్రంప్ సపోర్ట్ ఇచ్చినా!









