
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వెంటనే రాజీనామా చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లోగా కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెల్చి చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఆమె రాజీనామా చేయకపోతే.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడానికి కూడా అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌రఫ్ లేఖను గవర్నర్‌కు పంపడానికి రెడీ కూడా అయినట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన రాజీనామాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సురేఖ కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తారా? లేకపోతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : నిర్మల్ జిల్లాలో విషాదం… బాసర బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి..
మంత్రి పదవి నుంచి కొండా సురేఖ ఔట్.!
కాసేపట్లో అధికారికంగా ప్రకటన
కొండా సురేఖ వివరణపై హైకమాండ్ అసంతృప్తి
తనను మంత్రి పదవి నుంచి తొలగించొద్దని ఖర్గేను కోరిన కొండా సురేఖ
కొండా సురేఖకు ఎలాంటి హామీ ఇవ్వని ఖర్గే#kondasurekha #Telanganacongress #RTV pic.twitter.com/UjdphJaUFv
— RTV (@RTVnewsnetwork) September 3, 2026
అయితే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. పరకాల నియోజకవర్గంలో మళ్లీ రేవూరి ప్రకాశ్ రెడ్డికే టికెట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తీవ్రంగా మండిపడ్డారు. టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు? వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి నేనే పోటీ చేస్తా అని సవాల్ విసిరారు.
అంతేకాకుండా సీఎం కుటుంబంపైనా, నాయకత్వంపైనా ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొండా సురేఖ ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని.. బీసీ మహిళ అయిన తనపై కావాలనే కొందరు కుట్ర చేస్తున్నారని కొండా తెలిపారు.
Also Read : వైఎస్ రాజ్యం తీసుకొస్తా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!









