
MLC Elections : తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని రాష్ర్ట ఎన్నికల సంఘం చేపట్టింది. సెప్టెంబర్ 28 నుండి ఈ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఓటరుగా ఉన్న వారైనా లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కూడా తప్పనిసరిగా ఫారమ్-18 ద్వారా తిరిగి ఓటు కోసం అప్లై చేసుకోవలసిందే.
https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx
తెలంగాణలోని రెండు ప్రధాన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి కొత్త ఓటర్ల జాబితాను సేకరించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ మేరకు మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ తో పాటు వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలసి ఉంటుంది. కోరింది. ఈ నమోదు ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలు, అర్హతలు, ఆన్లైన్ అప్లికేషన్ విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Also Read : రాముడు-శివుడిపై సీఎం రేవంత్ కామెంట్స్.. బండి సంజయ్ కౌంటర్
ఓటరుగా నమోదుకు అర్హతలు ఏంటంటే?
కాగా, గ్రాడ్యుయేట్ (పట్టభద్రుల) ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలంటే క్రింది కనీస నిబంధనలు పాటించాలి..
డిగ్రీ విద్యార్హత: ఓటరు నమోదుకు తప్పనిసరిగా డిగ్రీ కనీస విద్యార్హత తప్పనిసరి. భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదేనీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండటం తప్పనిసరి.
విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫోటో ,ఇతర వివరాలను స్పష్టంగా, తప్పులు లేకుండా సమర్పించండి. తుది సమర్పణకు ముందు మొత్తం సమాచారాన్ని ఒకసారి పరిశీలించండి.
కాగా, ఓటరు నమోదు కోసం 2026 నవంబర్ 1ని కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. అంటే, 2023 నవంబర్ 1 లేదా అంతకంటే ముందే డిగ్రీ పాస్ అయి ఉన్నవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సదరు ఓటరు దరఖాస్తు చేస్తున్న నియోజకవర్గ పరిధిలో నివసిస్తూ ఉండాలి. అంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మీరు ఉదాహరణకు హైదరాబాద్ లేదా ఖమ్మం జిల్లాల పరిధిలో నివాసం కలిగి ఉండాలి. అలాగే భారతీయ పౌరుడై ఉండాలి.
పాత ఓటు ఉంటే సరిపోతుందా? మళ్లీ అప్లై చేయాలా?
గతంలో ఓటు వేశామని పాత ఓటు ఉంటే సరిపోతుందనుకోవడం పొరపాటు అది ఎంతమాత్రం సరిపోదు. కచ్చితంగా తిరిగి అప్లై చేయాల్సిందే. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ, ఈసారి మళ్లీ అప్లై చేసుకుంటేనే ఓటు హక్కు లభిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు ప్రతిసారీ కొత్తగా ఫ్రెష్ ఎలక్టోరల్ రోల్ తయారు చేస్తారు. కాబట్టి పాత ఓటర్లు సైతం మళ్లీ Form-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. అంతేకాదు, సాధారణ అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల ఓటరు కార్డు ఎమ్మెల్సీ ఎన్నిలక ఓటరు కార్డ్ వేరు కనుక అసెంబ్లీ ఓటు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్సీ ఓటు వస్తుందనుకోవడం సరికాదు.
ఓటు నమోదుకు కావాల్సిన కీలక పత్రాలు ఇవే
ఓటరు నమోదుకు దరఖాస్తు ఫారంతో పాటు క్రింది సర్టిఫికేట్లను జత చేయాల్సి ఉంటుంది..
దీనికోసం ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కాన్వొకేషన్ లేదా మార్కుల మేమో. దీనిపై గెజిటెడ్ అధికారి లేదా నోటరీ అటెస్టేషన్ తప్పనిసరి చేసి ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ ను కలిగి ఉండాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను జత చేయాలి.
Also Read : శంషాబాద్ దిశ ఘటన స్థలంలో దారుణం… మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి యత్నం
ఆన్లైన్, ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
ఓటరు చాలా సులభంగా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఓటు కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఆన్లైన్ ద్వారా అప్లై చేసే విధానం:
1. తెలంగాణ ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ ceotelangana.nic.in ఓపెన్ చేయండి.
2. అక్కడ కనిపించే “Council Constituency” / “Form-18” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. మన పేరు, అడ్రస్, గ్రాడ్యుయేషన్ వివరాలు పూర్తిగా నింపాలి.
4. గెజిటెడ్ లేదా నోటరీ సైన్ చేసిన మీ డిగ్రీ కాపీ, ఆధార్, ఫోటోలను స్క్యాన్ చేసి అప్లోడ్ చేయాలి.
5. సబ్ మీట్ కొట్టిన తర్వాత వచ్చే Acknowledgement ID ని సేవ్ చేసుకోవాలి.
ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసే విధానం:
తహసీల్దార్ , ఆర్డీవో లేదా ERO/AERO ఆఫీసుల నుంచి ఫారమ్-18 తీసుకుని వివరాలు నింపి, జిరాక్స్ కాపీలు జతచేసి అక్కడే అందజేయవచ్చు.
ఇంపార్టెంట్ డేట్స్ ఇవే
రాష్ర్ట ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం …
గ్రాడ్యుయేషన్ ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 28, 2026 న విడుదలైంది.
దరఖాస్తులను స్వీకరించడానికి నవంబర్ 6, 2026, చివరి తేదీ –
అర్హత గణన తేదీ – నవంబర్ 1, 2026
ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 25, 2026న ప్రదర్శిస్తారు.
అభ్యంతరాల స్వీకరణ కు- నవంబర్ 25 – డిసెంబర్ 10, 2026 చివరి తేదిగా పేర్కొన్నారు.
తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 30, 2026 న విడుదల చేస్తారు.
నవంబర్ 6 వరకు అవకాశం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా గ్రాడ్యుయేట్లందరూ తమ ఓటు కోసం అప్లై చేసుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు కోరుతున్నారు.









