
BIG BREAKIG : నేపాల్లోని పశ్చిమ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు నేపాల్ జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. అధికారుల వివరాల ప్రకారం, ఉదయం కచ్చితంగా 4:40 గంటలకు భూకంపం సంభవించింది. బజ్హాంగ్ జిల్లాలోని కోట్దేవాల్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావంతో బజ్హాంగ్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన బైతాడి ప్రాంతంలోని పలు చోట్ల కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.









