
Ali Khamenei House : అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. టెహ్రాన్‌లోని ఆయన అధికారిక నివాస సముదాయమే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న ఖమేనీ కాంపౌండ్‌కు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా తాజాగా తొలిసారిగా అధికారికంగా విడుదల చేసింది.
ఇరాన్ మీడియా పంచుకున్న 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఖమేనీ నివాస భవనం అత్యంత దారుణంగా ధ్వంసమైన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా ప్రయోగించిన బాంబుల దాటికి అక్కడి కాంక్రీట్ నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ కీలక దృశ్యాలను బయటపెట్టడం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ఇరాన్ యత్నించింది.
Also Read : అస్త్ర నుంచి బ్రహ్మోస్ వరకు.. భారత్ వెపన్లకు మస్త్ డిమాండ్.. కారణం ఏంటో తెలుసా?
🔸وبسایت رسمی علی خامنهای روز چهارشنبه ۱۷ تیر برای نخستینبار تصاویری از محل کشته شدن او را در بخشی از یک ویدئوکلیپ منتشر کرد.
🔸در این تصاویر ویرانههای برجا مانده از محل «حسینیه امام خمینی» دیده میشود که در روز نهم اسفند مورد حملۀ هوایی قرار گرفت.
🔸«حسینیۀ امام خمینی»… pic.twitter.com/2dx2VqLF9U
— RadioFarda|راديو فردا (@RadioFarda_) July 8, 2026
వారం రోజులుగా ఖమేనీ పార్థివ దేహానికి సంబంధించి అంతిమయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఇరాన్, ఇరాక్ దేశాల్లోని పలు ప్రధాన నగరాల మీదుగా ఈ యాత్ర సాగింది. తమ సుప్రీం నేతకు ఆఖరి వీడ్కోలు చెప్పేందుకు లక్షలాది మంది ప్రజలు రహదారులపైకి తరలివచ్చారు. శోకసంద్రంలో మునిగిపోయిన పౌరులు అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
Also Read : అమెరికా వెళ్లాలనుకునే టెకీలకు షాకింగ్ న్యూస్.. H-1B వీసా స్కామ్.. జేడీ వాన్స్ సంచలన ప్రకటన!
ఖమేనీ సొంత పట్టణమైన మషహద్‌లో గురువారం నాడు ఆయన పార్థివ దేహానికి ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించేలా అమెరికా దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది. మషహద్ పట్టణానికి చేరుకోవడానికి అత్యంత కీలకమైన రెండు వంతెనలు ఈ దాడుల్లో ధ్వంసమవ్వగా, భద్రతా కారణాల రీత్యా టెహ్రాన్-మషహద్ మధ్య రైలు రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు.
ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా కుట్ర పూరితంగా దాడులకు పాల్పడుతోందని ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రకమైన సైనిక చర్యలు ఇలాగే కొనసాగితే, అమెరికా, దాని మిత్రదేశాలపై తాము ఇచ్చే తిరుగులేని స్పందన అత్యంత భీకరంగా ఉంటుందని ఐఆర్‌జీసీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన ఈ దాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడి మరణం, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరగడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధం వచ్చిపడుతుందేమోనన్న తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తీసుకోబోయే ప్రతికార చర్యలపైనే భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.









