
ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రభుత్వం చర్చలు జరుపుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి చట్టసభల నుంచి పెద్ద నిరసన ఎదురైంది. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ అమెరికా పార్లమెంట్ ఎగువ సభ ఓ కీలక తీర్మానాన్ని ఆమోదించింది.
సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అమెరికా పార్లమెంట్ ప్రత్యేకంగా అనుమతి ఇస్తే తప్ప, ఇరాన్‌తో శత్రుత్వపూరిత చర్యల నుండి అమెరికా సైన్యాన్ని అధ్యక్షుడు వెంటనే వెనక్కి రప్పించాలని ఈ తీర్మానం స్పష్టం చేస్తోంది. అధ్యక్షుడి ఇష్టానుసార నిర్ణయాల వల్ల ప్రాంతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చనే ఆందోళనతో చట్టసభ సభ్యులు ఈ చర్యకు పూనుకున్నారు. ఈ తీర్మానం ఇప్పటికే దిగువ సభ ఆమోదం కూడా పొందింది.
Also Read : ఈ యుద్ధం ఇప్పట్లో పోదు మామా.. మరో రెండు కొత్త కండిషన్లు.. ఇరాన్ ఒప్పుకుంటుందా?
Big Shock For Trump
రెండు సభలలోనూ ఈ తీర్మానం నెగ్గడం ద్వారా ఇరాన్ వివాదంలో అమెరికా సైనిక జోక్యంపై రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలలో పెరుగుతున్న ఆందోళనలు స్పష్టమయ్యాయి. అయితే సాంకేతికంగా ఇది కేవలం ఒక సంకేతాత్మక చర్య మాత్రమే. 1973 నాటి ‘వార్ పవర్స్ యాక్ట్’ కింద ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అధ్యక్షుడి సంతకం అవసరం లేదు. అలాగే ఇది చట్టపరమైన అమలు శక్తి ఉండదు. ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని.. కాబట్టి చట్టబద్ధంగా తమను బంధించలేదని వైట్ హౌస్ ఇప్పటికే కొట్టిపారేసింది.
అదనపు అనుమతి లేకుండానే అమెరికా సైనిక కార్యకలాపాలను నిర్దేశించే రాజ్యాంగ అధికారం అధ్యక్షుడికి ఉందని వైట్ హౌస్ వాదిస్తోంది. దీనికి భిన్నంగా దేశాన్ని యుద్ధంలోకి లాగగల నిర్ణయాలలో పార్లమెంట్‌దే కీలక పాత్ర అని ఈ తీర్మాన మద్దతుదారులు అంటున్నారు. ఈ తీర్మానం వల్ల ట్రంప్ ప్రభుత్వం తన తక్షణ సైనిక వ్యూహాన్ని మార్చే అవకాశం లేనప్పటికీ, సైనిక చర్యల కంటే దౌత్యపరమైన పరిష్కారాలను అన్వేషించాలని వైట్ హౌస్‌పై రాజకీయ ఒత్తిడి పెంచుతోందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read : మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. నాలుగు విమానాశ్రయాల మూసివేత..









